Sunday, July 26, 2026
HomeLATESTVaranasi:హమ్మయ్య..రాజమౌళి నెత్తిన పెద్ద భారం దిగ్గిపోయింది..వారణాసికి లైన్స్ క్లియర్‌..!

Varanasi:హమ్మయ్య..రాజమౌళి నెత్తిన పెద్ద భారం దిగ్గిపోయింది..వారణాసికి లైన్స్ క్లియర్‌..!

Varanasi:సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ‘వారణాసి’ టైటిల్ వివాదం ముగిసింది. టైటిల్‌పై ఉన్న అడ్డంకులు తొలగడంతో చిత్ర బృందానికి ఊరట లభించింది.

on
- Advertisement -banner Ad

Varanasi:దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమా ముందుగానే పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుంది. అయితే దాని వెనక ఆయన పెద్ద ప్లాన్ కూడా చేస్తూ ఉంటారు. అందుకే ఆయన ప్రాజెక్టులుకి సాధారణంగా ఎలాంటి వివాదాలు లేదా అనుకొని ఆటంకాలు ఎదురు కావు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ అడ్వెంచర్ మూవీ “వారణాసి” విషయంలో మాత్రం కొంచెం సమస్య ఏర్పడింది. చిన్న టైటిల్ సమస్య రావడంతో సినీ వర్గాలల్లో వారణాసి సినిమా పెద్ద చర్చినీయాంశంగా మారింది

వారణాసి టైటిల్ పై భారీ ఆసక్తి:

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతుంది. కథకు సినిమా కాన్సెప్ట్ కు అనుగుణంగా అన్ని భాషలలోనూ సులభంగా గుర్తుండిపోయేలా “వారణాసి” అనే టైటిల్ ని చిత్ర బృందం ఎంపిక చేశారు. ఈ పేరుకు ఆధ్యాత్మిక తో పాటు విశ్వవ్యాప్త గుర్తింపు ఉండడంతో మేకర్స్ దీనిపై ప్రత్యేక దృష్టి కూడా పెట్టారు.

- Advertisement -
Advertisement

టైటిల్ రిజిస్ట్రేషన్ తో ఎదురైన సమస్య:

అయితే వారణాసి అనే టైటిల్ ఇప్పటికే దర్శకుడు సుబ్బారెడ్డి పేరిట రిజిస్టర్ అయి ఉండడంతో తెలుగు వర్షన్ కు అదే పేరును ఉపయోగించడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో తెలుగులో రాజమౌళి వారణాసి ఇతర భాషలలో వారణాసి(Varanasi) పేరుతో విడుదల చేసే అవకాశాలను పరిశీలించినట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపించాయి.

ALSO READ:OTT: పోలీస్ రాసిన స్టోరీ.. ఓటీటిలోకి మరో మలయాళ థ్రిల్లర్ మూవీ!

- Advertisement -
Advertisement

సుబ్బారెడ్డి నిర్ణయంతో క్లియర్ అయిన అడ్డంకి :

ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు సుబ్బారెడ్డి.. రాజమౌళి లాంటి దర్శకుడి ప్రాజెక్టు కి ఎలాంటి అడ్డంకి ఉండకూడదని ఉద్దేశంతో తన వద్ద ఉన్న “వారణాసి” టైటిల్ హక్కులను స్వచ్చందంగా అప్పగించినట్లు తెలుస్తుంది. తెలుగు సినిమాఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఈ ప్రాజెక్టుకు తన సహకారం అందించడం ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ALSO READ:Jana Nayakudu:విజయ్ ‘జననాయకుడు’ రెండో రోజు షాక్.. కలెక్షన్లు సగానికి పడిపోయాయి

- Advertisement -
Advertisement

అన్ని భాషల్లో ఒకే టైటిల్:

సుబ్బారెడ్డి నిర్ణయంతో టైటిల్ సమస్య పూర్తిగా పరిష్కారమైంది. దీంతో ఈ భారీ పాన్ వరల్డ్ చిత్రాన్ని తెలుగు సహా అన్ని భాషలలోనూ వారణాసి పేరుతోనే విడుదల చేసే అవకాశాలు బలపడినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you