Jana Nayakudu:దళపతి విజయ్ ప్రధాన పాత్రలో హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామ “జననాయగన్”(Jana Nayakudu).. జననాయగన్ సినిమాని రూ. 450 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఇందులో మమత బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్ , బాబి డియోల్ తదితర నటీనటులు నటించారు. హిందీలో జననేత, తెలుగులో జననాయకుడు అనే పేర్లతో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది.
రెండో రోజు కలెక్షన్లు ఎంత ?:
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండో రోజు ఇండియాలో ఈ సినిమా రూ.21.15 కోట్ల నెట్టు కలెక్షన్లు సాధించింది. తొలిరోజు నమోదైన రూ.42.70 కోట్ల నెట్ తో పోలిస్తే ఇది దాదాపు సగానికి పైగా తగ్గిపోయిందనే చెప్పాలి. దీంతో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా “జననాయగన్” సినిమా రూ. 63.85 కోట్ల నెట్ వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్స్ సుమారు రూ.75 కోట్లకు చేరాయి.
ఓవర్సీస్ లో మంచి వసూళ్లు:
విదేశీ మార్కెట్లో మాత్రం సినిమా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుంది. రెండో రోజు రూ.10 కోట్ల గ్రాస్ రాబట్టడంతో.. రెండు రోజుల ఓవర్సీస్ గ్రాస్ రూ.37.50 కోట్లకు చేరింది. దేశీయ విదేశీ వసూలను కలిపి చూస్తే ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.112.5 సున్న కోట్ల గ్రాస్ కలెక్షన్ నమోదు చేసినట్లు ట్రేడ్ అంచనాలు సూచిస్తున్నాయి.
ALSO READ:Jabardasth:”ఆ ఇద్దరి రహస్యాలు నాకు తెలుసు”.. జబర్దస్త్ నరేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ!
తెలుగు వర్షన్ పరిస్థితి:
తెలుగు మార్కెట్లో కూడా రెండో రోజు వసూలు తగ్గాయి. తొలిరోజు రూ.2.75 కోట్లు నెట్ సాధించిన జననాయకుడు.. రెండో రోజు రూ.1.35 కోట్లను మాత్రమే రాబట్టింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కలిపి రెండో రోజు సుమారు రెండు కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.
ALSO READ:OTT:బిచ్చగాడు మూవీ హీరో నటించిన..వంద దేవుళ్లు ఏ ఓటీటిలో చూడొచ్చు అంటే?
ఆక్యుపెన్సీ ఎలా ఉంది?:
హైదరాబాద్‌లో సుమారు 22.5 శాతం, విశాఖపట్నంలో 29.5 శాతం, గుంటూరులో 47.5 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం. మరోవైపు తమిళనాడులో సాయంత్రం, రెండో షోలకు 60.31 శాతం ఆక్యుపెన్సీ నమోదవడం విశేషం. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, తమిళ ప్రేక్షకుల నుంచి సినిమాకు ఇంకా మంచి ఆదరణ లభిస్తుండటంతో అక్కడ వసూళ్లు నిలకడగా కొనసాగుతున్నాయి.మరి రేపటి రోజున ఆదివారం సెలవు కనుక కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.




