Friday, October 2, 2026
HomeLATESTTollywood 2027:సీనియర్ హీరోలంతా సంక్రాంతి టార్గెట్..!

Tollywood 2027:సీనియర్ హీరోలంతా సంక్రాంతి టార్గెట్..!

Tollywood 2027: 2027 సంక్రాంతి టార్గెట్గా బడా హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పసల థియేటర్ల కేటాయింపు ప్రశ్నార్ధకంగా మారింది.

on
- Advertisement -banner Ad

Tollywood 2027:టాలీవుడ్ సీనియర్ హీరోలు సైతం ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా తమ సినిమాలను తెరకెక్కిస్తూ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలయ్య వంటి దిగ్గజ హీరోలు సైతం అభిమానులను మెప్పించడానికి భిన్నమైన కథలతో అలరిస్తున్నారు. అలా ఈ నెలలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. చిరంజీవి ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తదుపరి సినిమా కాకాని 2027(Tollywood 2027) జనవరి 13న సంక్రాంతి రేసులో విడుదల చేయబోతున్నారు.

సంక్రాంతి పోటీలో వరుస చిత్రాలు..

బాలయ్య తాజాగా నటిస్తున్న దాదా సినిమాని కూడా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా దాదా సినిమాను డిసెంబర్ 24న ఈ ఏడాది విడుదల చేయాలనుకున్నప్పటికీ బాలయ్యకు గాయం కారణం చేత సినిమా షూటింగ్ వాయిదా పడడంతో సంక్రాంతి బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. దీంతో కాకా సినిమా రిలీజ్ అవుతున్న రోజు బాలయ్య దాదా సినిమా విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పైన అటు అభిమానులలో చిత్ర బృందాలలో సీరియస్ డిస్కషన్ జరుగుతోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Vaishnav tej:మొదటి సినిమాతోనే 100 కోట్లహిట్ కొట్టిన మెగా హీరో.. ఇప్పుడేం చేస్తున్నారంటే..?

పెద్ద హీరోల చిత్రాలు ఒకే టైంలో వస్తే ఇబ్బందులు తప్పవా..

ఒకవేళ అన్ని ఓకే అయితే 2027 లో చిరంజీవి కాకా, బాలకృష్ణ దాదా సినిమాలు బరిలో దిగితే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద ఫైట్ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇలా పెద్ద సినిమాలు ఒకేసారి బరిలో దిగితే మాత్రం థియేటర్ల కేటాయింపులకు చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనింగ్స్ ప్రతి ఒక్కటి కూడా కాంపిటీషన్ గానే ఉంటుంది. ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు రావడం సంక్రాంతి రేసులో ఉండడం మరింత వేడెక్కించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు సైతం తెలుపుతున్నారు. చిరంజీవి ,బాలయ్య ఇలా ఒకేసారి పోటీ పడడం ఇదేమి కొత్తేమీ కాదు.. గతంలో కూడా రెండు మూడు సార్లు పోటీ పడ్డట్టుగా తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Sigma Movie Review : సిగ్మా మూవీ రివ్యూ.. జాసన్ సంజయ్ డైరెక్షన్ ఎలా ఉందంటే?

ఫైనల్ అయ్యే చిత్రాలు ఏవి?

అక్కినేని నాగార్జున నటిస్తున్న కింగ్ సినిమా డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. దీంతో బాలయ్య సినిమా పోస్ట్ పోన్ అయితే నాగార్జునకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. విక్టరీ వెంకటేష్ , కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం జనవరి 12న విడుదల. ఈ సినిమాని కూడా సంక్రాంతి బరిలో దించబోతున్నారు. దీంతో ఒకేసారి ముగ్గురు హీరోల సినిమాలు సంక్రాంతి రేసులో ఉండడం అంటే మరింత వేడెక్కించే అవకాశం ఉంటుంది. మరి నిజంగానే దాదా సినిమా జనవరి 13న వస్తుందా? లేక ప్లాన్ ఏదైనా మారుస్తారా? అనే విషయంపై అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇవే కాకుండా సంక్రాంతి బరిలో మరికొన్ని చిత్రాలు కూడా ఉండే అవకాశాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you