TV:సెప్టెంబర్ 21, సోమవారం.. టీవీ ప్రేక్షకులకు రోజంతా వినోదం అందించేలా తెలుగు ఛానెళ్లు ఆసక్తికరమైన సినిమాలతో సిద్ధమయ్యాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీస్‌తో పాటు పలు సూపర్‌హిట్ చిత్రాలు ప్రసారం కానున్నాయి. పని మధ్యలో కాస్త రిలాక్స్ కావాలన్నా.. కుటుంబంతో కలిసి సినిమా చూడాలన్నా ఈ రోజు టీవీ(TV) ఛానెళ్లలో మంచి ఆప్షన్లు ఉన్నాయి. మరి ఏ ఛానెల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో చూద్దాం రండి.
డీడీ యాదగిరి :
డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ‘కుంకుమ రేఖ’, రాత్రి 9.30 గంటలకు ‘శ్రీ రామరక్ష’ ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఈటీవీ ప్లస్, ఈటీవీ :
ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ‘పోలీస్ లాకప్’ ప్రసారం కానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 10 గంటలకు *‘ఆదిత్య 369’*ను చూడొచ్చు.
ఈటీవీ సినిమా :
ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు ‘ఆకాశ వీధిలో’, ఉదయం 10 గంటలకు ‘మయూరి’, మధ్యాహ్నం 1 గంటకు ‘కొండపల్లి రాజా’, సాయంత్రం 4 గంటలకు ‘సందడే సందడి’ ప్రసారం కానున్నాయి. రాత్రి 7 గంటలకు ‘భైరవ ద్వీపం’, రాత్రి 10 గంటలకు ‘స్పై’, అర్ధరాత్రి 1 గంటకు ‘ఆకాశ వీధిలో’ ప్రసారం అవుతాయి.
also read:Kevvu Karthik: బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా జబర్దస్త్ కమెడియన్..!
జెమిని ఛానెళ్లలో సినిమాలు :
జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు ‘అభిలాష’, సాయంత్రం 4.30 గంటలకు ‘వసుంధర నిలయం’ ఉన్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు ‘కితకితలు’, మధ్యాహ్నం 3.30 గంటలకు ‘జిల్’ ప్రసారం కానున్నాయి.
జెమిని మూవీస్‌లో ఉదయం 1.30 గంటలకు ‘నిన్ను చూశాక’, 4.30 గంటలకు ‘అమాయకుడు’, 7 గంటలకు ‘ఉంగరాల రాంబాబు’, 10 గంటలకు ‘కొమరం పులి’ ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంటకు ‘సత్యమేవ జయతే’, సాయంత్రం 4 గంటలకు ‘వేట్టయాన్’, రాత్రి 7 గంటలకు ‘అంజి’, రాత్రి 10 గంటలకు ‘నిరీక్షణ’ ప్రసారం అవుతాయి.
also read:Rashmika Mysaa: యాక్షన్ సీన్స్ తో దుమ్ము లేపేసిన రష్మిక..!
జీ తెలుగు, జీ సినిమాలు :
జీ తెలుగులో ఉదయం 9 గంటలకు ‘ప్రేమించు’ ప్రసారం కానుంది. జీ సినిమాల్లో ఉదయం 3 గంటలకు ‘నెక్ట్స్ నువ్వే’, 7 గంటలకు ‘మొగుడు’, 9 గంటలకు ‘తఢాఖా’, మధ్యాహ్నం 12 గంటలకు ‘పండగ చేస్కో’, 3 గంటలకు ‘బలుపు’ ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు ‘జవాన్’, రాత్రి 9 గంటలకు ‘దాస్ కీ ధమ్కీ’, అర్ధరాత్రి 12 గంటలకు ‘పండగ చేస్కో’ ప్రసారం కానున్నాయి.
స్టార్ మా, స్టార్ మా మూవీస్ :
స్టార్ మా ఛానెల్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ‘ఫిదా’, రాత్రి 11 గంటలకు ‘లక్కీ భాస్కర్’ ఉన్నాయి. స్టార్ మా మూవీస్‌లో ఉదయం 3 గంటలకు ‘మొదటి సినిమా’, 7 గంటలకు ‘నా పేరు శేషు’, 9 గంటలకు ‘గల్లీ రౌడీ’, మధ్యాహ్నం 12 గంటలకు ‘చంద్రముఖి’ ప్రసారం అవుతాయి. సాయంత్రం 3 గంటలకు ‘టెడ్డీ’, 6 గంటలకు ‘క్రాక్’, రాత్రి 9.30 గంటలకు ‘వీర సింహా రెడ్డి’ చూడొచ్చు.
స్టార్ మా గోల్డ్ :
స్టార్ మా గోల్డ్‌లో ఉదయం 2.30 గంటలకు ‘వీర భద్రుడు’, 5 గంటలకు ‘1977 ఏం జరిగింది’, 8 గంటలకు ‘సంకీర్తన’, 11 గంటలకు ‘ద్రోణాచార్య’ ప్రసారం కానున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ‘శుభలేఖ’, సాయంత్రం 5 గంటలకు ‘అయోగ్య’, రాత్రి 8 గంటలకు ‘యమదొంగ’, రాత్రి 11 గంటలకు ‘సంకీర్తన’ ప్రసారం అవుతాయి.




