Varanasi: తెలుగు సినీ పరిశ్రమని ఇతర దేశాలకు తెలిసేలా చేసిన డైరెక్టర్ రాజమౌళి గురించి , ఆయన తెరకెక్కించే చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి సినిమా ఆలస్యంగా వచ్చినా.. రికార్డులు మాత్రం సరికొత్తగా సృష్టిస్తాయి. అలా ఇప్పటికే ఎన్నో చిత్రాలతో ఎన్నో రికార్డులు తిరగ రాసిన రాజమౌళి ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వారణాసి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా 1000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు వినిపిస్తోంది.
వారణాసి సినిమా స్టోరీ రివీల్ చేసిన రాజమౌళి.
వారణాసి (Varanasi)సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే తాజాగా వారణాసి సినిమా కథనం మరియు ప్రమోషన్స్ వీడియో పైన రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ నేపథ్యం ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే విషయం పైన రాజమౌళి వివరిస్తూ.. వారణాసి సినిమా ప్రయాణం వారణాసిలో ప్రారంభమై.. అక్కడ నుంచి అంటార్కికా.. ఆ తర్వాత ఆఫ్రికా ఖండం వరకు కొనసాగుతుందని అంతటితో ఆగకుండా కాలంలో వెనక్కి వెళ్తూ ప్రాచీన రోహి సామ్రాజ్యాన్ని తాకి చివరికి మళ్ళీ తిరిగి వారణాసికే చేరుతుందంటూ తెలియజేశారు.
ALSO READ:Raashii Khanna: బికినీ ఫోజులతో రెచ్చగొడుతున్న రాశి ఖన్నా.. ఫోటోలు వైరల్
అందుకే అప్పుడు కథ గురించి చెప్పలేదు..
రాజమౌళి చెప్పిన ఈ మాటలు విని మహేష్ అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. సినిమా నుంచీ విడుదల చేసిన ప్రమోషన్ వీడియో గురించి స్పందిస్తూ తాము ఇప్పటికే ఒక టీజర్ ని రిలీజ్ చేశాము. అందులో కథను ఎక్కువగా రివీల్ చేయకూడదనుకున్నాము. ఎందుకంటే అంత పెద్ద కథను ఒక చిన్న టీజర్ లో చూపించడం సరైనది కాదు.. అందుకే కథను బయట పెట్టకుండా పేక్షకులను థియేటర్లో ఒక సరికొత్త అనుభూతిని పొందేలా చేస్తున్నామంటూ రాజమౌళి తెలియజేశారు.
ALSO READ:OTT:కొంప ముంచేసిన ఓటీటీ కొత్త రూల్స్..ఇక నిర్మాతలకి చుక్కలే..?
అంచనాలు పెంచుతున్న రాజమౌళి మాటలు..
రాజమౌళికి మాట్లాడిన ఈ మాటలను బట్టి చూస్తూ ఉంటే ఈ చిత్రం కేవలం ఒక ప్రాంతానికో దేశానికి పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్త పర్యటన విజువల్స్ మరియు చారిత్రాత్మక అంశాలతో కూడిన ఒక అడ్వెంచర్ మూవీగా ఉండబోతున్నట్లు స్పష్టం అవుతుంది. ఇక రాజమౌళి చూపించే విజువల్స్, స్టోరీ నడిపించే తీరు అద్భుతంగా ఉంటుంది అందుకే రాజమౌళి సినిమా అంటే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎదురుచూస్తూ ఉంటారు. 2027 ఏప్రిల్ ఏడవ తేదీన వారణాసి సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ముఖ్యంగా మహేష్ బాబు కెరియర్ లోని ఈ సినిమా చాలా కీలకంగా ఉంటుందంటూ తెలియజేశారు. మహేష్ బాబు గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.




