Sunday, July 26, 2026
HomeLATESTJabardasth:"ఆ ఇద్దరి రహస్యాలు నాకు తెలుసు".. జబర్దస్త్ నరేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ!

Jabardasth:”ఆ ఇద్దరి రహస్యాలు నాకు తెలుసు”.. జబర్దస్త్ నరేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ!

Jabardasth:బుల్లెట్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలపై జబర్దస్త్ నరేష్ ఆసక్తికరంగా స్పందించాడు. "ఆ ఇద్దరి రహస్యాలు నాకు మొత్తం తెలుసు" అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Jabardasth:జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్ “నరేష్” ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచారు. జబర్దస్త్ (Jabardasth)కామెడీ షోలో కామెడీ టైమింగ్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరేష్.. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వంటి ప్రముఖ కమెడియన్లతో కలిసి ఎన్నో విజయవంతమైన స్కిట్లలో నటించారు. అయితే ఇటీవల బుల్లెట్ భాస్కర్ చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసాయి.

వైరల్ అయిన కామెంట్లపై నరేష్ స్పందన :

ఓ కార్యక్రమంలో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ..” నరేష్ (Naresh) ను ఎక్కడికైనా పిలిస్తే డబ్బులు ఇవ్వాల్సిందే.. డబ్బులు ఇవ్వకపోతే రాడు.. ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉన్న బైకుకు పెట్రోల్ వేయిస్తేనే వస్తాడని” సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో చాలామంది వాటిని నిజమని భావిస్తూ వీడియోలు ట్రెండ్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్.. ఈ విషయంపై స్పందిస్తూ..” ఆ మాటల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. భాస్కర్ సరదాగా చెప్పిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకొని తనను డబ్బుకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు”.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:బిచ్చగాడు మూవీ హీరో నటించిన..వంద దేవుళ్లు ఏ ఓటీటిలో చూడొచ్చు అంటే?

భాస్కర్ పై గౌరవం ఉందన్న నరేష్ :

బుల్లెట్ భాస్కర్(Bullet Bhaskar) తనకు గురువు లాంటి వాడని .. ఆయన గురించి తాను ఎప్పుడూ చెడుగా మాట్లాడనని నరేష్ తెలిపారు. భాస్కర్ చాలా సరదా మనిషి అని..ఆయన మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తెరపై వచ్చిన విమర్శలతో ఆయన పై తన అభిప్రాయం ఏ మాత్రం మారలేదని కూడా చెప్పాడు.

- Advertisement -
Advertisement

ALSO READ:Chennai Love Story:కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’కి తొలి రోజు కలెక్షన్స్!

సరదాగా కౌంటర్ ఇచ్చిన కమెడియన్.

అదే సమయంలో తాను ఎప్పుడు హైపర్ ఆది లేదా భాస్కర్ పై ఇలాంటి వ్యక్తిగత జోక్స్ చేయలేదని నరేష్ చెప్పారు. అయితే వారిద్దరి తరచు తన పై పంచ్ లు వేస్తుంటారని పేర్కొన్నారు. “నాకు వాళ్ల గురించి చాలా విషయాలు తెలుసు ..నేను కూడా మాట్లాడితే చెప్పడానికి చాలా ఉంటాయి.. కానీ అవన్నీ సరదాకే పరిమితం” అంటూ చిరునవ్వుతో కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఈ వివాదానికి స్వయంగా నరేష్ పూర్తి స్పష్టత ఇచ్చినట్లైంది..!!

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you