OTT Movie: ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. లవ్ స్టోరీస్, ఎమోషనల్ స్టోరీస్ కన్నా కూడా క్రైమ్ థ్రిల్లర్ లనే ఎక్కువగా జనాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ ఊహించని ట్విస్ట్ లతో సాగే కథలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి ప్రముఖ ఓటిటి వేదికలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలాంటి చిత్రాలలో తాజాగా కన్నడ సూపర్ హిట్ ‘కేస్ ఆఫ్ కొండాన’ కూడా ఒకటి. మూడు రోజుల క్రితమే తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ కి ప్రారంభమైన ఈ చిత్రం తక్కువ సమయంలోనే టాప్ ట్రెండింగ్ లో చోటు దక్కించుకుంది.
ALSO READ:Jr NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. షూటింగ్లో గాయం!
ఆసక్తికరమైన కథ తో సాగే థ్రిల్లర్ :
ఈ సినిమా కథ కర్ణాటకలోని “కొండాన” (Case of Kondana) అనే చిన్న పట్టణంలో ఒకే రాత్రి చోటుచేసుకునే అనూహ్య సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రాంతంలో వరుస హత్యలు కలకలం రేపతుండగా.. సీరియల్ కిల్లర్ ని పట్టుకునేందుకు ఏసిపి లక్ష్మి (భావన మీనన్) దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఇదే సమయంలో కొత్తగా ఏఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన విల్సన్ (విజయ్ రాఘవేంద్ర) జీవితంలో ఊహించిన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒక చిన్న దొంగతనం ఘటనలో జరిగిన అనుకొని సంఘటనల వల్ల విల్సన్ తీవ్ర సమస్యల్లో ఇరుక్కుంటాడు. తన తప్పును దాచిపెట్టే ప్రయత్నంతో మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటాడు. మరోవైపు సీరియల్ కిల్లర్ కేసును చేదించే క్రమంలో ఏసీబీ లక్ష్మీ దృష్టికి కూడా విల్సన్ పై పడుతుంది. దీంతో ఈ కథ మరింత ఉత్కంఠ భరితంగా మారుతుంది.
ALSO READ:OTT Crime: మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లతో తిరిగొస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సీజన్ 2.. ఈసారి మరింత డేంజర్!
ఓటీటీలో తప్పక చూడాల్సిన సినిమా :
విల్సన్ చివరకు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు..? అసలు వరుసహత్యలకు కారణమైన సీరియల్ కిల్లర్ ఎవరు..? కథ ఎలాంటి..? ముగింపుకు చేరుకునింది అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ సినిమా ఓటీటీలో తప్పక చూడాల్సిందే. ప్రతి మలుపులో ఉత్కంఠను పెంచే స్క్రీన్ ప్లే ఊహించని సీన్లు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నలుస్తాయి. దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ రాఘవేంద్ర, భావన మీనన్, ఖుషి, రవి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీ (OTT Movie) వేదికలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ ధ్రిల్లర్..సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి ఎంపికగా నిలుస్తుంది అని చెప్పవచ్చు..!!




