Tuesday, July 28, 2026
HomeLATESTPavala shyamala: నటి పావలా శ్యామల కన్నుమూత!

Pavala shyamala: నటి పావలా శ్యామల కన్నుమూత!

Pavala shyamala: సీనియర్ నటిమని పావలా శ్యామల గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు గుండెపోటుతో మృతి చెందారు

on
- Advertisement -banner Ad

Pavala shyamala: క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సీనియర్ నటిగా పేరు సంపాదించిన నటి పావలా శ్యామల గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఈమె జూలై 28న అర్ధరాత్రి 1:52 నిమిషాలకు హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. పావలా శ్యామల మరణానికి ముఖ్య కారణం తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లుగా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పావలా శ్యామల భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలియజేశారు.

నటి పావలా శ్యామల కన్నుమూత..

గత కొన్నేళ్లుగా పావలా శ్యామల(Pavala shyamala) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఇక కుమార్తె కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తన నటనతో బాగా గుర్తింపు సంపాదించుకున్న పావలా శ్యామల.. చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో మరణించడం సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తోంది. పావలా శ్యామల మరణం పైన టాలీవుడ్ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. పావుల శ్యామలకు గత కొద్ది సంవత్సరాలుగా హైబీపీ ఉన్నది. కరోనా సమయంలో CAD వంటి సమస్య (గుండెకు సంబంధించి) రావడం జరిగింది.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. రెండు రోజుల్లోనే టాప్ ట్రెండింగ్‌..!

ఉస్మానియాలో చికిత్స పొందుతున్న కూతురు..

గడిచిన మూడు నెలల క్రితం పావలా శ్యామలతో పాటుగా ఆమె కూతురు మాధవి హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఇది గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఛాతీ ఆసుపత్రి సూపర్డెంట్ శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు ఉస్మానియా హాస్పిటల్లో వారికి వైద్యం కూడా అందించారు. కానీ శ్యామల ఉస్మానియా ఆసుపత్రిలో ఉండలేమని మళ్లీ ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికి తిరిగి వచ్చేశారు పావలాశ్యామల. అక్కడ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారిని అనాధ ఆశ్రమానికి తరలించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Jr NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. షూటింగ్లో గాయం!

గుండెపోటుతో శ్యామల మృతి..

గతవారం మళ్లీ పావలా శ్యామల గుండె సంబంధిత కారణాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరగా.. నగరంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె కూతురు మాధవిను కూడా ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చుకున్నారు. అనంతరం శ్యామల ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రోజున అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you