Rashmika:రష్మిక మందన్న ఆల్రెడీ నేషనల్ క్రష్‌గా తనేంటో ప్రూవ్ చేసుకుంది. డిఫరెంట్ డిఫరెంట్ సినిమా కథలను చూస్ చేసుకుంటూ, ఆ సినిమాలను హిట్ చేసుకుంటూ అభిమానులను సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇంకా పెంచుకునే లాంటి సినిమా రష్మిక మందన్న ఖాతాలో పడింది.
ప్రతిష్టాత్మక పాత్రలో రష్మిక మందన్న :
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) మందన్న కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఇప్పటివరకు ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది, ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు భారతదేశ సంగీత చరిత్రలోనే చెరగని ముద్ర వేసుకున్న దిగ్గజ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించనున్నారు. ఆమె బయోపిక్‌లో రష్మిక మందన్న నటించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ :
సుబ్బలక్ష్మి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి ‘ఎం.ఎస్. – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో సుబ్బలక్ష్మి పాత్రను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పోషించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై సినీ అభిమానులతో పాటు సంగీత ప్రియుల్లోనూ ఆసక్తి నెలకొంది.
రష్మిక పాత్రపై ఆసక్తికర చర్చ :
రష్మికను సుబ్బలక్ష్మి పాత్రకు ఎంపిక చేసినట్టు గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆమె తప్పుకున్నారని, ఆమె పాత్రలోకి సాయి పల్లవి వచ్చిందంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఫైనల్‌గా రష్మికను ఓకే చేసినట్లు మేకర్స్ ఒక పోస్టర్‌తో అధికారికంగా ధ్రువీకరించారు.
పాత్రకు తగ్గట్టుగా ఆమె రూపురేఖలు, హావభావాలు, నటనలో ఎలాంటి మార్పులు తీసుకురానున్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
also read:Chiranjeevi:మెగాస్టార్ విశ్వంభరకు..రూట్ క్లియర్..!
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో :
ఈ బయోపిక్కు ప్రతిభావంతుడైన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తూ ఉండడం ఇంకా హైలైట్ అయ్యే విషయం. కథను భావోద్వేగపూర్వకంగా, సహజమైన శైలిలో తెరకెక్కించడంలో మంచి పేరున్న ఆయన ఇప్పుడు లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితాన్ని వెండితెరపై ఎలా చూపిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
also read:Samantha: ఘనంగా సమంత సీమంతపు వేడుక.. ఫోటోలు వైరల్!
అనిరుధ్ సంగీతం.. భారీ నిర్మాణం :
ఈ చిత్రానికి స్టార్ దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని అల్లు అరవింద్, బన్నీ వాసు, రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తూ ఉండడం విశేషం. ఈ సినిమాను సెప్టెంబర్ 16న చెన్నైలో అధికారికంగా ప్రారంభించనున్నారు. సుబ్బలక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది.
చీఫ్ గెస్ట్‌గా కమల్ హాసన్ :
ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా కమల్ హాసన్ రాబోతున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడిన ప్రముఖ గీతాలను ఆలపిస్తూ ఆమెకు సంగీత నివాళి అర్పించనుంది ఇండియన్ చోరల్ ఎన్సెంబుల్ బృందం.




