Sunday, July 26, 2026
HomeLATESTRam Charan:హీరో రామ్ చరణ్ కు సర్జరీ.. ఎందుకంటే?

Ram Charan:హీరో రామ్ చరణ్ కు సర్జరీ.. ఎందుకంటే?

Ram Charan: ప్రముఖ హీరో రామ్ చరణ్ కి సర్జరీ జరగబోతోంది అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Ram Charan:టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సినిమాలోని పాత్ర కోసం ఎంతలా కష్టపడతారో ఆయన సినిమాలోని యాక్టింగ్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ ఏడాది పెద్ది సినిమాతో ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న రాంచరణ్ ఈ సినిమా షూటింగ్ సమయంలో చిన్నపాటి గాయాలైనట్టుగా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ మణికట్టుకు గాయం అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్ ని పూర్తి చేశారు. అనంతరం చికిత్స కోసం రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్ కి రామ్ చరణ్ సర్జరీ కోసం వెళ్లబోతున్నట్లు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ కి సర్జరీ..

ఈ నేపథ్యంలోని ఈరోజు మెగా కుటుంబం కోయంబత్తూర్ కి బయలుదేరినట్లుగా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి, సురేఖ ,ఉపాసన, రామ్ చరణ్ (Ram Charan)కి తోడుగా ఉండబోతున్నారు. ఈ సర్జరీ ప్రముఖ సీనియర్ డాక్టర్ అయిన ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నిర్వహించబోతున్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయి అనంతరం రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని రావాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

ALSO READ:Chiranjeevi:గబ్బర్ సింగ్ నటుడుకి సహాయం చేసిన మెగా ఫ్యామిలీ!

రామ్ చరణ్ సినిమాలు..

రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. పెద్ది చిత్రంతో 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టారు. ఈ సినిమా కూడా విలేజ్ స్పోర్ట్స్ డ్రామా తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించింది. రామ్ చరణ్ తదుపరిచిత్రం RC -17ను డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:ACTRESS Ajay :పెళ్లి తర్వాతే జీవితం మారింది: నటుడు అజయ్ ఎమోషనల్ కామెంట్స్!

నెక్స్ట్ సినిమా షూటింగ్ అప్పుడే..

రామ్ చరణ్ గాయం నుంచి పూర్తి కోలుకున్న తరువాతే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా నటీనటుల విషయాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. డైరెక్టర్ సుకుమార్ కూడా ఈసారి చాలా విభిన్నమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you