Sunday, July 26, 2026
HomeLATESTChiranjeevi:గబ్బర్ సింగ్ నటుడుకి సహాయం చేసిన మెగా ఫ్యామిలీ!

Chiranjeevi:గబ్బర్ సింగ్ నటుడుకి సహాయం చేసిన మెగా ఫ్యామిలీ!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గబ్బర్ సింగ్ నటుడు రమేష్ కి ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.

on
- Advertisement -banner Ad

Chiranjeevi:టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగా కుటుంబం అంటేనే సహాయానికి పెట్టింది పేరు. అలా ఇప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలకు, అభిమానులకు సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా గబ్బర్ సింగ్ చిత్రంతో పాటుగా పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రమేష్.. ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ కి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషయం పైన తన తోటి నటులు కూడా సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా నటీనటులను కోరారు. ఈ విషయం పైన మెగా కుటుంబం స్పందించినట్లుగా తెలుస్తోంది.

రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి సహాయం..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటుడు రమేష్ ఆరోగ్యం పైన స్పందించారు..అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డి గారితో తరచూ మాట్లాడుతున్నారని, రమేష్ ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చిరంజీవి, వారి కుటుంబ సభ్యులను కూడా కలిసి చికిత్స ఖర్చులకోసం మూడు లక్షల రూపాయల చెక్కును కూడా అందించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకం ద్వారా కూడా నటుడు రమేష్ కి అవసరమైన సహాయం అందించేలా చేస్తానంటూ చిరంజీవి రమేష్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అలాగే నాగబాబు కూడా మరో రెండు లక్షల రూపాయలు చెక్కును అందించినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

ALSO READ:ACTRESS Ajay :పెళ్లి తర్వాతే జీవితం మారింది: నటుడు అజయ్ ఎమోషనల్ కామెంట్స్!

గబ్బర్ సింగ్ మూవీతో భారీ పాపులారిటీ..

నటుడు రమేష్ త్వరగా కోలుకొని పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు. రమేష్ ఆస్పత్రిలో చేరిన విషయం డైరెక్టర్ హరిశంకర్ కు తెలియగానే రమేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అలాగే తన వంతు ఆర్థిక సహాయం కూడా చేశారు. 2012లో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో రమేష్ విలన్ గ్యాంగులో ఒకరుగా నటించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో వచ్చే అంత్యాక్షరి కామెడీ ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. అందులో రమేష్ నటన కూడా ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Mahesh Babu:మహేష్ బాబు వీడియోతో సోషల్ మీడియా షేక్.. జయకృష్ణ డెబ్యూ మూవీపై హైప్..!

త్వరగా కోలుకోవాలంటూ..

రమేష్ యాక్టింగ్ నచ్చి పవన్ కళ్యాణ్ ఏకంగా అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలలో కామెడీ విలన్ పాత్రలను కూడా చేయించారు .అలాగే ఇతర హీరోల చిత్రాలలో కూడా కమెడియన్ గా, నటుడిగా నటించి మెప్పించారు. మరి రమేష్ ఆరోగ్యం కూడా కుదుటపడి త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా కోరుకుంటున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you