Monday, October 5, 2026
HomeLATESTAadarsha Kutumbam: అక్టోబర్ 9 నుంచి 30కి..వెంకటేష్ సినిమా రిలీజ్ డేట్ మార్పు వెనుక భారీ...

Aadarsha Kutumbam: అక్టోబర్ 9 నుంచి 30కి..వెంకటేష్ సినిమా రిలీజ్ డేట్ మార్పు వెనుక భారీ ప్లాన్!

Aadarsha Kutumbam: టాలీవుడ్‌లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్ మారడం వెనుక కేవలం షూటింగ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ కారణాలే ఉండవు.

on
- Advertisement -banner Ad

Aadarsha Kutumbam: టాలీవుడ్‌లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్ మారడం వెనుక కేవలం షూటింగ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ కారణాలే ఉండవు. ముఖ్యంగా స్టార్ హీరోలు, క్రేజీ కాంబినేషన్ల సినిమాల విషయంలో బాక్సాఫీస్ లెక్కలు, థియేటర్ల లభ్యత, ఇతర చిత్రాలతో పోటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ విషయంలోనూ ఇదే తరహా బిజినెస్ ప్లాన్ నడుస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 30కి? :

వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తొలుత అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అక్టోబర్ 9కి తేదీ మారినట్లు ప్రచారం జరిగింది. అయితే రిలీజ్‌కు వారం రోజులే ఉన్నప్పటికీ పెద్దగా ప్రమోషనల్ కార్యక్రమాలు కనిపించకపోవడంతో సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలపై చర్చ మొదలైంది.

- Advertisement -
Advertisement

ప్రస్తుతం అక్టోబర్ 30వ తేదీని కొత్త రిలీజ్ డేట్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

also read: Satya Krishnan:ఒక్క ఇమేజ్‌తోనే అవకాశాలు పోయాయి.. బొమ్మరిల్లు నటి సత్య కృష్ణన్ ఆవేదన!

- Advertisement -
Advertisement

‘హనుమాన్ అంశ్’తో క్లాష్ వద్దనేనా? :

ఈ వాయిదా వెనుక ప్రధాన కారణంగా ‘హనుమాన్ అంశ్’ సినిమాను కొందరు పేర్కొంటున్నారు. హిందీ మార్కెట్‌లో భారీ స్పందన అందుకున్న ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి హైప్ ఏర్పడిందని టాక్. అంతేకాకుండా తెలుగులో ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో మార్కెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ‘ఆదర్శ కుటుంబం’ వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఆసక్తి ఉంది. రెండు భిన్నమైన జోనర్లకు చెందిన సినిమాలు ఒకే సమయంలో బాక్సాఫీస్ బరిలోకి దిగితే ఓపెనింగ్స్, థియేటర్ల కేటాయింపు విషయంలో పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే అనవసరమైన క్లాష్‌ను తప్పించుకునేందుకు ‘ఆదర్శ కుటుంబం’ను వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -
Advertisement

also read: Teja Sajja: హోస్ట్‌గా తేజ సజ్జా.. ‘ది ట్రేటర్స్’ కోసం భారీ రెమ్యునరేషన్!

సేఫ్ గేమ్ ప్లానా? :

త్రివిక్రమ్ మరో సినిమాకు భయపడి రిలీజ్ డేట్ మార్చుకున్నారనే ప్రచారాన్ని కొందరు అభిమానులు అంగీకరించడం లేదు. అయితే ఇది భయపడటం కంటే బిజినెస్ పరంగా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోటీ తగ్గి, సోలో రిలీజ్ దక్కితే థియేటర్లు ఎక్కువగా లభించడంతో పాటు ఓపెనింగ్స్ కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం మేకర్స్ అక్టోబర్ 30 తేదీపై దృష్టి పెట్టినట్లు సమాచారం. పూర్తి స్థాయి ప్రమోషన్లతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ విషయంలో స్పష్టత రానుంది. వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌కు సోలో రిలీజ్ దొరికితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి..??

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you