Kara Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), మమితా బైజు జంటగా.. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’ (Kara Movie). విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 30న తెలుగులో రిలీజ్ కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ ఫస్ట్ లుక్‌లో భార్యాభర్తలుగా ధనుష్, మమితా బైజు కనిపించి ఆకర్షించారు.
‘కర’ ట్రైలర్ (Kara Trailer)
తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ (Kara Trailer)ని మేకర్స్ విడుదల చేశారు. సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ట్రైలర్ ఇంట్రస్టింగ్‌గా ఉండటమే కాకుండా, సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


