Sunday, July 26, 2026
HomeVIDEOSJetlee Trailer: ఆసక్తికరంగా కమెడియన్ సత్య ‘జెట్లీ’ ట్రైలర్

Jetlee Trailer: ఆసక్తికరంగా కమెడియన్ సత్య ‘జెట్లీ’ ట్రైలర్

Jetlee Trailer: కమెడియన్‌గా సత్య హీరోగా దర్శకుడు రితేష్ రానాతో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్లీ’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

on
- Advertisement -banner Ad

Jetlee Trailer: కమెడియన్‌గా సత్య (Comedian Satya) హీరోగా దర్శకుడు రితేష్ రానా (Ritesh Rana)తో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్లీ’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మరోసారి క్విర్కీ, డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందని తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం, మే 1న విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు. ఈ ట్రైలర్ (Jetlee Trailer) ఎలా ఉందంటే..

Also Read- OTT Platforms: రూట్ మారింది.. ‘కమర్షియల్ సేఫ్టీ’కే!

- Advertisement -
Advertisement

యాక్షన్ హీరోగా సత్య (Jetlee Trailer)

ఈ కథలో సత్య పాత్ర చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన ఒక వ్యక్తిగా, తనను తాను వెతుక్కుంటూ వింత పరిస్థితుల్లో కనిపించే వ్యక్తిగా ఇందులో సత్య కనిపిస్తున్నారు. కానీ తన ప్రశ్నలకు సమాధానాలు దొరకడం బదులుగా, చుట్టూ ఉన్నవారి నుంచి సెటైర్లు ఎదురవుతాయి. ఈ కాన్సెప్ట్‌ను ఎమోషనల్‌గా కాకుండా పూర్తిగా కామెడీ ట్రాక్‌లో నడిపించడం ఈ సినిమాకి ఉన్న ప్రధాన బలంగా చెప్పవచ్చు. ట్రైలర్‌లో కనిపించే మరో ఆసక్తికర అంశం విషయానికి వస్తే.. రియాలిటీ, పర్సెప్షన్ మధ్య ఉన్న కాంట్రాస్ట్. అందరికీ సత్య ఒక జోకర్‌లా కనిపించినా, తాను మాత్రం పెద్ద యాక్షన్ హీరోలా బిహేవ్ చేస్తూ యాక్షన్ ఇరగదీసేస్తున్నాడు. ఈ మిస్ మ్యాచ్ వల్లే సినిమా మొత్తం నవ్వుల వర్షంగా మారుతోంది. యాక్షన్ సీన్స్ కూడా సీరియస్‌గా కాకుండా, ప్యారడీ టచ్‌తో ఉండటం ప్రత్యేక ఆకర్షణ.

సత్య స్పెషల్ ఇదే..

- Advertisement -
Advertisement

సత్య తన సహజమైన స్టైల్‌లో అండర్‌ప్లే పెర్ఫార్మెన్స్‌తో నవ్వులు పండిస్తున్నాడు. ఎక్కువగా ట్రై చేయకుండా కామెడీ క్రియేట్ చేయగలగడం సత్య ప్రత్యేకత. అదే మరోసారి ఈ ట్రైలర్‌ తెలియజేస్తుంది. రియా సింగ్ గ్లామర్‌తో పాటు యాక్షన్‌లో కూడా ఆకట్టుకుంటుండగా.. వెన్నెల కిషోర్, వైవా హర్ష తమ ట్రేడ్‌మార్క్ కామెడీతో సినిమాపై మరింత ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేస్తున్నారు. దర్శకుడు రితేష్ రానా తన ప్రత్యేకమైన స్టైల్‌ను ఈసారి మరింత ఎలివేట్ చేశారు. టెక్నికల్‌గా కూడా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సురేష్ సారంగం విజువల్స్‌కు కలర్‌ఫుల్ టోన్ ఇవ్వగా, కాల భైరవ సంగీతం ట్రైలర్ ఎనర్జీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ సింక్ అయింది. ఎడిటింగ్‌ను కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైన్‌ను నార్ని శ్రీనివాస్ అందించారు. మొత్తానికి ట్రైలర్ చూస్తే ఈ సినిమా సరదాగా ఎంటర్‌టైన్ చేయడానికి, నవ్వులు పంచడానికి రాబోతున్న వినూత్న ప్రయత్నంగా ‘జెట్లీ’ని చెప్పుకోవచ్చు.

Also Read- JD Chakravarthy: కమల్ హాసన్‌కు రాని అదృష్టం నాకొచ్చింది

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you