Samantha:టాలీవుడ్ హీరోయిన్ సమంత దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత నందిని రెడ్డి డైరెక్షన్లో నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం. ఈ సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటుగా ఈ సినిమాలోని యాక్షన్ థ్రిల్లర్ సీన్స్ లో సమంత నటించిన నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. జూన్ 19వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.13 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.73 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఓటిటిలోకి సమంత మా ఇంటి బంగారం..
ఇక ఓవర్సీస్ లో కూడా మా ఇంటి బంగారం సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడ 2 మిలియన్ డాలర్లను క్రాస్ చేసినట్లుగా ఇటీవల చిత్ర బృందం తెలియజేసింది. ముఖ్యంగా ఈ సినిమాకు పోటీగా మరో సినిమాలేవి లేకపోవడంతో సమంత(Samantha) సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే ఇప్పుడు వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటి హక్కులను ప్రముఖ ఓటీటి సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు ఆ న్యూస్ సారాంశం.
also read:BulliRaju:రోజుకు లక్ష రూపాయలు సంపాదిస్తున్న బుల్లి రాజు!
డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇందుకోసం నిర్మాతలకు కూడా భారీగానే సదరు ఓటీటీ సంస్థ చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయిన 28 నుంచి 36 రోజులలోపు ఓటీటీలోకి తీసుకువచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. ఈ లెక్కన చూసుకుంటే జూలై లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ట్రాలాల పిక్చర్స్ బ్యానర్ పైన సుమారుగా 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సమంతతో పాటుగా, శ్రీనివాస గవిరెడ్డి, మంజుష, శ్రీముఖి తదితర నటినటులు నటించారు.
also read:Akhil raj:డెలివరీ బాయ్ ను కొట్టడానికి యత్నించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ అఖిల్.. తండ్రిని నెట్టేసి మరీ!
వరుస సక్సెస్ లతో సమంత జోరు..
సమంత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సమంత ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇటీవలే సమంత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంతో అటు అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో మీ ముందుకి వస్తానని, కేవలం కొన్ని నెలలు మాత్రమే తాను విశ్రాంతి తీసుకుంటానని తెలియజేసింది. మొత్తానికి సమంత ఒకే ఏడాది అటు సినిమాతో సక్సెస్ అయ్యి ఇటు గుడ్ న్యూస్ చెప్పడం గమనార్హం.


