BulliRaju:తెలుగు సినీ పరిశ్రమలో చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి చాలామంది సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా చైల్డ్ యాక్టర్ గా చిన్న వయసులోనే భారీ మొత్తంలో పారితోషకం తీసుకున్న వారు కూడా ఉన్నారు. అలా అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్న చైల్డ్ యాక్టర్ రేవంత్ (బుల్లి రాజు) విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశారు. దీంతో అప్పటి నుంచి బుల్లిరాజుకి టాలీవుడ్ సినిమాలలో డిమాండ్ భారీగా పెరిగిపోయింది.
ఆశ్చర్యపరుస్తున్న బుల్లిరాజు రెమ్యూనరేషన్..
అంతేకాకుండా తన కామెడీ టైమింగ్ తో అందర్నీ నవ్విస్తున్న బుల్లిరాజు తను నటించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ ను అందుకుంటున్నాయి. దీంతో బుల్లిరాజు (BulliRaju) రెమ్యూనరేషన్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బుల్లి రాజు రోజుకి దాదాపుగా లక్ష రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక బాల నటుడుకి రోజువారి ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అంటే ఆశ్చర్య తగ్గ విషయమే అని పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
also read:Akhil raj:డెలివరీ బాయ్ ను కొట్టడానికి యత్నించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ అఖిల్.. తండ్రిని నెట్టేసి మరీ!
వరుస సినిమాలలో అవకాశాలు..
బుల్లి రాజు ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్టుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారని చెప్పవచ్చు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సహజమైన యాక్టింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ప్రస్తుతం వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సక్సెస్ గ్రాఫ్ పెంచుకుంటున్న బుల్లిరాజు క్రేజ్ చూసి టాలీవుడ్ మేకర్స్ సైతం తమ సినిమాలలో ప్రత్యేకమైన పాత్రలను ఇస్తున్నారు. కళ్యాణ్ రామ్, వెంకటేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil ravipudi)దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా బుల్లి రాజు కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
also read:Pawan Kalyan:ముంబైకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. అసలేం జరిగిందంటే?
బుల్లిరాజు బ్యాక్ గ్రౌండ్..
బుల్లిరాజు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా చానమిల్లి ప్రాంతానికి చెందిన పిల్లాడు సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వల్ల పాపులారిటీ సంపాదించుకొని, అనిల్ రావిపూడి దృష్టికి ఆ వీడియో వెళ్లడంతో సినిమాలలోకి తీసుకున్నారు. అలా విక్టరీ వెంకటేష్, చిరంజీవి, నవీన్ పోలిశెట్టి వంటి హీరోల చిత్రాలలో నటించారు. ప్రస్తుతం బుల్లిరాజు చేతిలో 10 సినిమాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో బుల్లిరాజు క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.


