Wednesday, July 1, 2026
HomeLATESTJabardast: జబర్దస్త్ యాంకర్ గా రష్మీకి ఎలా అవకాశం వచ్చిందంటే?

Jabardast: జబర్దస్త్ యాంకర్ గా రష్మీకి ఎలా అవకాశం వచ్చిందంటే?

Jabardast: జబర్దస్త్ రష్మీకి యాంకర్ గా అవకాశం ఎలా వచ్చింది అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Jabardast: ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ ఫిమేల్ యాంకర్ గా పేరు సంపాదించిన వారిలో రష్మీ కూడా ఒకరు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మి అప్పుడప్పుడు పలు సినిమాలలో కూడా నటిస్తూ అభిమానులను బాగా అలరిస్తోంది. అంతేకాకుండా సుధీర్, రష్మీ జంటకు బుల్లితెరపై మంచి క్రేజీ ఉంది. అలా కూడా మరింత పాపులారిటీ సంపాదించుకుంది రష్మీ. ఇటీవలే ఓటీటి లో ఒక షో కి హోస్టుగా వ్యవహరించిన రష్మి ఆ షోకి సంబంధించి ప్రమోషన్స్ లో తాజాగా పాల్గొనింది. ఆ ఈవెంట్ కి హాజరైన రష్మీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను తెలియజేస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి..

ముఖ్యంగా రష్మీ (Rashmi Gautam)ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణాలను కూడా తెలియజేసింది . తన కుటుంబం అంతా కూడా ఉద్యోగస్తులే అని, తల్లి మమతా గౌతమ్ ఒరిస్సా , తండ్రి రామ్ గౌతమ్ ఉత్తరప్రదేశ్.. కాని తాను మాత్రం విశాఖపట్నంలో పుట్టి పెరిగానని తెలిపింది. తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కి సినీ ఇండస్ట్రీతో సంబంధం లేదని, తాను మాత్రమే ఇలా దారి తప్పి ఈ ఫీల్డ్ లోకి వచ్చానని తెలిపింది. మా నాన్న చిన్నప్పుడే మరణించాడు. దీంతో తన తల్లి తనను పెంచి పోషించిందని , తన కెరియర్ ప్రారంభంలో యువ అనే సీరియల్ లో తాను నటించాను కానీ ఆ సమయంలో పెద్దగా గుర్తింపు రాలేకపోయిందని తెలియజేసింది.

- Advertisement -

also read:Samantha:సమంత బ్లాక్ బాస్టర్ మా ఇంటి బంగారం.. ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే..?

అలాంటి వాటికి దూరం..

అనంతరం కొంతకాలం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ తిరిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే జబర్దస్త్ లోని యాంకర్ గా పని చేసే అవకాశం లభించిందని తెలియజేసింది. యాంకర్ గా పాపులారిటీ వచ్చినప్పటికీ సినిమా ఆఫర్లు రావడంలేదని కేవలం స్పెషల్ సాంగ్ ల కోసమే తనని ఆఫర్ చేస్తున్నారని తెలియజేసింది. కానీ తను మాత్రం వాటన్నిటికీ దూరంగా ఉండాలనుకున్నానని కేవలం తనకు పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా చేస్తానని తెలియజేసింది రష్మి. త్వరలోనే ఆహా లో ప్రారంభం కాబోతున్న ఒక కొత్త షో కి హొస్టుగా రాబోతోంది.

- Advertisement -

also read:BulliRaju:రోజుకు లక్ష రూపాయలు సంపాదిస్తున్న బుల్లి రాజు!

రష్మీ సినిమాలు..

రష్మీ 2002లో విడుదలైన హోలీ అనే సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించినా.. ఆ తర్వాత కరెంట్, ఎవరైనా ఎప్పుడైనా ,గణేష్, బిందాస్, ప్రస్థానం, గుంటూరు టాకీస్, అంతం, నెక్స్ట్ నువ్వే, బొమ్మ బ్లాక్ బాస్టర్, భోళా శంకర్, హాస్టల్ బాయ్స్ తదితర చిత్రాలలో హీరోయిన్గా కీలకమైన పాత్రలలో కూడా నటించింది రష్మీ. ప్రస్తుతం త్రిశంకు అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా రష్మీ అభిమానులు మాత్రం తమ వివాహం ఎప్పుడు అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి వివాహం పైన ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you