Thursday, July 2, 2026
HomeLATESTOTT Movies: ఓటీటీలో భయపెడుతున్న తెలుగు హర్రర్ మూవీ?

OTT Movies: ఓటీటీలో భయపెడుతున్న తెలుగు హర్రర్ మూవీ?

OTT Movies: ఓటీటీలో ఒక సినిమా ఇప్పుడు దుమ్ము దులిపేస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

on
- Advertisement -banner Ad

OTT Movies: థియేటర్లులో కొన్ని చిత్రాలు విడుదలైనప్పటికీ సినిమా కథనం లేదా నటీనటులు కొత్త వారైతే సినిమా సరిగ్గా ఆడడం కష్టమే. అయితే ఓటీటిలోకి వచ్చిన తర్వాత మాత్రం కొన్ని సూపర్ హిట్గా సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే సిల్వర్ స్క్రీన్ పైన సత్తా చాటలేని సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్ లో మాత్రం భారీ స్థాయిలో రికార్డు వ్యూస్ సంపాదిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి కోవకే చెందిన ఒక సినిమా థియేటర్లలో ఒక మోస్తారుగా ఆడి ఓటీటి ఆడియన్స్ ను మాత్రం భయపెట్టేలా ఆకట్టుకుంటోంది.ఆ సినిమా ఏదో కాదు” ది డెవిల్స్ చైర్” . ఈ సినిమా ఒకటి కాదు ఏకంగా రెండు ఓటీటీ లలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఓటిటిని దుమ్ము దులిపేస్తున్న ది డెవిల్స్ చైర్..

స్టోరీ విషయానికి వస్తే.. ప్రధాన పాత్రుడైన విక్రమ్ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారు. అయితే అతను క్రికెట్ బెట్టింగ్ వల్ల జూదం వల్ల పీకల్లోతు అప్పులు చేస్తారు. దీంతో ఈజీ మనకోసం తాను పనిచేసే కంపెనీలోనే డబ్బులు కొట్టేసి క్రికెట్ బెట్టింగ్లో వాటిని పెడతారు. ఆ విషయం బయటపడడంతో కంపెనీ యాజమాన్యం విక్రమ్ ను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా పోలీస్ కేసు కూడా నమోదవుతుంది. అలాంటి సమయంలో విక్రమ్ కు అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది తన ప్రియురాలు రుది. అలా ఆమె ఒక రోజు చాలా ఇష్టపడి ఒక పురాతన చైర్ ను కొనుగోలు చేస్తుంది. ఆ కుర్చీకి ఒక దుష్టశక్తి ఆవహిస్తుంది. అది కేవలం విక్రమ్ కు మాత్రమే కనిపిస్తూ అతని బలహీనతలను ఆసరాగా చేసుకుని , కొన్ని షరతులను విధించి డబ్బు ఇవ్వడం ప్రారంభిస్తుంది. అలా అసలు ఆ కూర్చి నేపథ్యం ఏంటి? చివరికి ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ.

- Advertisement -

ALSO READ:Pooja Hegde:పవన్ కళ్యాణ్ తో పూజా హెగ్డే.. అదృష్టం కలిసొచ్చేనా?

మిస్టరీ థ్రిల్లర్ గా..

తెలుగు హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంగా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని గంగా సప్తశికర దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో హీరోగా జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి(Adhire Abhi )నటించగా.. స్వాతి మందల్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఆదిత్య చౌదరి, చత్రపతి శేఖర్ తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆహా తో పాటుగా యూట్యూబ్లో కూడా ది డెవిల్స్ చైర్ సినిమా అందుబాటులో ఉంది. ఇందులో అదిరే అభి యాక్టింగ్ మాత్రం బాగానే ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా తర్వాత మళ్లీ అదిరే అభి ఎలాంటి సినిమాని అధికారికంగా ప్రకటించలేదు. కేవలం జబర్దస్త్ షోలో మాత్రమే కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

- Advertisement -

ALSO READ:Raghava Lawrence:రూమర్స్‌కు ఫుల్ స్టాప్… తిరుచ్చి ఈస్ట్ పోటీపై లారెన్స్ క్లారిటీ!

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you