Saturday, July 4, 2026
HomeLATESTAkhil Akkineni:అక్కినేని అఖిల్ మూడేళ్లు గ్యాప్ కు కారణం సర్జరీనేనా?

Akhil Akkineni:అక్కినేని అఖిల్ మూడేళ్లు గ్యాప్ కు కారణం సర్జరీనేనా?

Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ ఏజెంట్ తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడంపై తాజాగా స్పందించారు.

on
- Advertisement -banner Ad

Akhil Akkineni:టాలీవుడ్ లో బడా ఫ్యామిలీ గా పేరు పొందిన కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీకి చెందిన నాగార్జున ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. ఆయన కుమారుడు నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా హీరోలు గానే రాణిస్తున్నారు. తాజాగా అఖిల్(Akhil Akkineni) నటిస్తున్న చిత్రం లెనిన్. ఈ సినిమా జులై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ విడుదల అవ్వగా.. పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ తాను చివరిగా నటించిన ఏజెంట్ సినిమా తర్వాత మూడు సంవత్సరాలు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనే విషయంపై స్పందించారు.

ఏజెంట్ తర్వాత విరామంపై అఖిల్ స్పందన..

మురళి కిషోర్ దర్శకత్వంలో వస్తున్న లెనిన్ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే(Bhagya Shree Borse) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్, భాగ్యశ్రీ బోర్సే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అఖిల్ తన పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. మూడేళ్ల గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంపై మాట్లాడుతూ ..” ఏజెంట్ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేయాలనుకున్నాను. అయితే ఆ సినిమా విడుదలైన మూడు నెలలకి నేను ప్రమాదవశాత్తు బాత్రూంలో జారి పడటం వల్ల, నా చేతికి గాజు ముక్కలు చాలా బలంగా దిగాయి. ఎడమ చేతి వేళ్లకు రెండు శస్త్ర చికిత్సలు కూడా చేశారని” తెలిపారు.

- Advertisement -

also read:Nababandham Movie Review: ‘నాగబంధం’ మూవీ రివ్యూ.. విజువల్ వండర్ గా ఆకట్టుకుందా?

16 నెలల విశ్రాంతి..

అంతేకాకుండా 48 కుట్లు పడ్డాయి. ఎనిమిది నెలల పాటు ఎలాంటి బరువులు ఎత్తకూడదని సూచించారు. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి సుమారుగా 16 నెలల వరకు సమయం పట్టిందని, అలా మూడేళ్ల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చిందని ఈ విషయం పైన నా అభిమానులు చాలా కోపంగా ఉంటారు.. ఇకమీదట అలా జరగదని హామీ ఇస్తున్నాను అంటూ తెలియజేశారు అఖిల్. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం అఖిల్ కు సలహా ఇస్తూ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

also read:Vishwambhara:ఎట్టకేలకు విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఇలాంటి స్టోరీతో ఇప్పటివరకు సినిమా రాలేదు..

లెనిన్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కథ విన్నప్పుడే చాలా కొత్త అనుభూతి కలిగించిందని, ఈ సినిమాలోని పాత్రలు విభిన్నమైన కోణాలు నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. ఇలాంటి స్టోరీ తో కానీ, ఈ కాన్సెప్ట్ తో ఇప్పటివరకు ఏ ఒక్క సినిమా కూడా రాలేదు .అందుకే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. ఇలాంటి సినిమాతోనే తాను కం బ్యాక్ ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేశారు అఖిల్. మరి ఈ సినిమా అఖిల్ కెరీర్ కు ఏ విధంగా సక్సెస్ అందుకునేలా చేస్తుందో చూడాలి మరి.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you