Wednesday, July 22, 2026
HomeMOVIE NEWSVishwambhara : ఎట్టకేలకు విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

Vishwambhara : ఎట్టకేలకు విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

Vishwambhara: వశిష్ట మల్లిడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభరా సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు మేకర్స్ ఫిక్స్ చేశారు.

on
- Advertisement -banner Ad

Vishwambhara:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సినిమా సినిమాకి తన మేలోవర్ ను మార్చేస్తూ ఉన్నారు చిరంజీవి(Chiranjeevi). గత సినిమాలతో పోలిస్తే .. ఈ ఏడాది వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి చాలా స్లిమ్ గా కనిపించారు. అంతేకాకుండా ఈ సినిమా చిరంజీవి తన కెరీర్ లోని అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటికి విడుదల కానీ సినిమా విశ్వంభర(Vishwambhara). ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ కారణం చేత కొంతమేరకు ఆలస్యం అవుతోందని, అంతేకాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అభిమానులను నిరాశపరచడంతో విఎఫ్ఎక్స్ పైన ప్రత్యేకించి దృష్టి పెట్టబోతున్నామని చిరంజీవి తెలియజేశారు.

విశ్వంభర రిలీజ్ డేట్ లాక్..

వాస్తవానికి విశ్వంభర సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ కారణాల వల్లే ఆలస్యం అవుతోంది. దీంతో అభిమానులు కూడా ఈ సినిమా విడుదల తేదీపై నిరాశలో ఉన్నారు. డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 16వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు వార్త వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:OTT:కేరళలో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీలో మెంటలెక్కిస్తున్న మలయాళం మూవీ!

షూటింగ్ మొదలైన మూడేళ్లకు..

మొత్తానికి ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న మెగా అభిమానుల కోసం ఎట్టకేలకు ఈ ఏడాది దసరాకి విశ్వంభర సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కీలకమైన పాత్రలలో సురభి, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్, ఈషా చావ్లా, ఆశిక రంగనాథ్ తదితరులు నటించబోతున్నారు. 2023 అక్టోబర్ 23న ఈ సినిమా షూటింగ్ని ప్రారంభించారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ మొదలై మూడు సంవత్సరాలు అవుతోంది.

- Advertisement -
Advertisement

also read:Aamir Khan:60 ఏళ్లలో మూడో పెళ్లి డేట్ ప్రకటించిన అమీర్ ఖాన్..!

బాలయ్యతో బాక్సాఫీస్ వార్ లేనట్టేనా?

మొన్నటి వరకు ఈ సినిమాని సంక్రాంతికి వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారనే విధంగా ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా బాలకృష్ణ నటించబోతున్న సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతోందని దీంతో బాలయ్య వర్సెస్ చిరంజీవి అన్నట్లుగా బాక్సాఫీసు వార్ అంటూ కొన్ని స్టోరీలు వైరల్ గా మారాయి. కానీ ఇప్పుడు అందరి అంచనాలను పక్కకు నెడుతూ ఈ ఏడాది చిరంజీవి నుంచి మరో సినిమా విడుదల కాబోతోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you