Wednesday, July 8, 2026
HomeLATESTBigg Boss Telugu:బిగ్‌బాస్ ఎంట్రీకి టాలీవుడ్ హీరోయిన్ షరతు..'నాగార్జున ఉంటే మాత్రం అస్సలు హౌస్‌లోకే రాను'!

Bigg Boss Telugu:బిగ్‌బాస్ ఎంట్రీకి టాలీవుడ్ హీరోయిన్ షరతు..’నాగార్జున ఉంటే మాత్రం అస్సలు హౌస్‌లోకే రాను’!

Bigg Boss Telugu:బిగ్‌బాస్‌లో పాల్గొనాలంటే నాగార్జున హోస్ట్‌గా ఉండకూడదని ఓ టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు ఆమె ఎందుకు ఇలా చెప్పిందో

on
- Advertisement -banner Ad

Bigg Boss Telugu:బిగ్‌బాస్ సీజన్ 10 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు చకచకా పూర్తి చేసేసింది బిగ్‌బాస్ యాజమాన్యం. ఆల్రెడీ కంటెస్టెంట్ల లిస్టు కూడా ఫైనలైజ్ చేసేసింది. ఈసారి కొత్త టాస్క్‌లతో చాలా గమ్మత్తుగా ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. మరీ ముఖ్యంగా, పోయినసారి కంటే ఈసారి ఇంకొంచెం కాంట్రవర్సియల్ కంటెంట్ క్రియేట్ చేసే విధంగా ఉండే కంటెస్టెంట్లను బిగ్‌బాస్‌లోకి తీసుకురావడానికి టీమ్ ప్రయత్నం చేస్తుందన్న వార్త బయటకు వచ్చింది.

మరోసారి హోస్ట్‌గా నాగార్జున:

అయితే, ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్‌బాస్ సీజన్‌ను హోస్ట్ చేయబోయేది నాగార్జున అనే క్లారిటీ వచ్చేసింది. నాగార్జున హోస్టింగ్‌పై కొంతమంది పాజిటివ్‌గా స్పందించినా, చాలామంది మాత్రం నెగిటివ్‌గానే స్పందిస్తూ వస్తుంటారు. మరీ ముఖ్యంగా, ఆయన అసలు ఎపిసోడ్స్ పూర్తిగా చూడరని, షూటింగ్‌కు వచ్చే ముందు టీమ్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే ఫాలో అవుతారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయి. ఎపిసోడ్స్ చూస్తేనే అసలు ఏం జరిగింది..? ఏ కంటెస్టెంట్ ఎలా ఆడారు..? అనేది తెలుస్తుందని, అలాంటప్పుడు కేవలం స్క్రిప్ట్ ఆధారంగా మాట్లాడటం సరికాదంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా మండిపడిన సందర్భాలు ఉన్నాయి.

- Advertisement -

మాజీ కంటెస్టెంట్ల విమర్శలు:

కేవలం ప్రేక్షకులే కాదు, హౌస్‌లో పార్టిసిపేట్ చేసిన కొంతమంది మాజీ కంటెస్టెంట్లు కూడా ఆయన హోస్టింగ్‌పై ఓపెన్‌గా విమర్శలు చేశారు. అసలు నాగార్జున హోస్టింగ్‌కు పనికిరారని కామెంట్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. మాజీ కంటెస్టెంట్ గీత రాయల్ ఓ సందర్భంలో మాట్లాడుతూ, బిగ్‌బాస్‌లో నాగార్జున పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అంటూ ఘాటుగా స్పందించారు. ఆయన తీరు సరిగా లేదని, షో మొత్తం స్క్రిప్టెడ్ అని సంచలన ఆరోపణలు చేశారు.

ALSO READ:Premi Viswanath:ప్రేమి విశ్వనాథ్ అస్సలు సీరియల్‌లోకి ఎలా వచ్చిందో తెలుసా..? లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదే..!

- Advertisement -

సోనియా  ఆకుల షాకింగ్ కామెంట్స్:

అంతేకాదు, పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన సోనియా ఆకుల కూడా ఈ షోలో కంటెస్టెంట్‌గా వెళ్లింది. ఆమె కూడా నాగార్జున హోస్టింగ్‌కు నెగిటివ్ మార్క్ ఇచ్చింది. నాగార్జున హోస్టింగ్ తనకు నచ్చలేదని, ఆయన హోస్ట్‌గా ఉంటే మరోసారి బిగ్‌బాస్ అవకాశం ఇచ్చినా హౌస్‌లోకి అడుగు కూడా పెట్టనని కరాఖండిగా చెప్పేసింది.

ALSO READ:Pinaka Teaser: బ్లాక్ మ్యాజిక్ తో మిస్టరీ ధ్రిల్లర్.. జనాలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసిన పినాక టీజర్

- Advertisement -

సోషల్ మీడియాలో చర్చ:

వీరే కాదు, ఇంకొంతమంది కంటెస్టెంట్లు కూడా నాగార్జున హోస్టింగ్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ, బిగ్‌బాస్ మాత్రం నాగార్జుననే హోస్ట్‌గా కొనసాగిస్తోంది. దీని వెనక ఏం రహస్యాలు ఉన్నాయో..? ఏం జరుగుతోందో ..? అంటూ సోషల్ మీడియాలో జనాలు గుసగుసలాడుతున్నారు. నాగార్జున హోస్టింగ్‌పై పాజిటివ్ కామెంట్స్ కంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా ఉండడం గమనార్హం. చూడాలి మరి, ఈ సీజన్ 10ను నాగార్జున ఏ విధంగా ముందుకు నడిపిస్తారో…???

 

View this post on Instagram

 

A post shared by Soniya Akula (@soniyaakulaa)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you