Wednesday, July 8, 2026
HomeLATESTPremi Viswanath:ప్రేమి విశ్వనాథ్ అస్సలు సీరియల్‌లోకి ఎలా వచ్చిందో తెలుసా..? లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదే..!

Premi Viswanath:ప్రేమి విశ్వనాథ్ అస్సలు సీరియల్‌లోకి ఎలా వచ్చిందో తెలుసా..? లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదే..!

Premi Viswanath:తెలుగు ప్రేక్షకులకు 'వంటలక్క'గా ఎంతో దగ్గరైన ప్రేమి విశ్వనాథ్ టెలివిజన్ రంగంలోకి ఎలా వచ్చారో తెలుసా? లాయర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన టర్నింగ్ పాయింట్ ఏంటి?

on
- Advertisement -banner Ad

Premi Viswanath:తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు వంటలక్కగా ఎంతో దగ్గరైన “ప్రేమి విశ్వనాథ్” పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది “కార్తీకదీపం” సీరియల్. తన సహజమైన నటన, హావభావాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మలయాళ నటి అసలు నటిగా మారకముందు న్యాయవాదిగా పనిచేసిందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఒక సాధారణ ఉద్యోగం నుంచి టెలివిజన్ స్టార్ నటిగా ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. అసలు ఆమె సీరియల్‌లోకి ఎలా వచ్చింది? కార్తీకదీపం సీరియల్‌లో ఎంతో మంది నటించినా ఆమెకే ఎందుకు ఎక్కువగా ప్రశంసలు దక్కాయి అనే విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

కలలపై ఆసక్తితో మొదలైన ప్రయాణం:

ప్రేమి విశ్వనాథ్(Premi Viswanath) కేరళ రాష్ట్రంలోని ఎడపాల్ ప్రాంతంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలపై చాలా ఆసక్తి ఉండేది. చదువుతో పాటు వివిధ కళా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ప్రతిభను చాటుకున్నారు. ఈ ఆసక్తే తర్వాత ఆమెను మోడలింగ్ వైపు అడుగులు వేయించేలా చేసింది. అదే ఇప్పుడు మన ముందున్న వంటలక్కగా నిలిచేలా చేసింది.

- Advertisement -

లాయర్‌గా కెరీర్.. ఆ తర్వాత ఊహించని మలుపు:

విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ప్రేమి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం కొచ్చిలోని ఒక ప్రైవేట్ సంస్థలో లీగల్ అడ్వైజర్‌గా కూడా పనిచేశారు. అయితే ఉద్యోగ జీవితంలో ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కలలపై ఉన్న మక్కువ మాత్రం తగ్గలేదు. మోడలింగ్‌లో అవకాశాలు రావడంతో ఆ రంగంలోకి అడుగుపెట్టారు. అదే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

మలయాళ బుల్లితెరలో తొలి గుర్తింపు:

మోడలింగ్ ద్వారా వచ్చిన అవకాశాలతో ప్రేమి మలయాళ టెలివిజన్ రంగంలోకి ప్రవేశించారు. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన కరుత ముత్తు సీరియల్ నటిగా ఆమెకు గొప్ప గుర్తింపును తీసుకొచ్చింది. ఇందులో కార్తీక పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తన తొలి సీరియల్‌తోనే ఉత్తమ నూతన నటిగా అవార్డు అందుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం.

- Advertisement -

ALSO READ:Pinaka Teaser: బ్లాక్ మ్యాజిక్ తో మిస్టరీ ధ్రిల్లర్.. జనాలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసిన పినాక టీజర్

కార్తీకదీపంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం:

కరుత ముత్తు సీరియల్‌ను తెలుగులో కార్తీకదీపంగా రీమేక్ చేయాలని నిర్ణయించినప్పుడు దీప పాత్రకు ప్రేమి విశ్వనాథ్‌నే సరైన ఎంపిక అని అంతా భావించారు. ఆమెను ఫైనలైజ్ చేశారు. ఆమె కూడా దానికి అంగీకారం తెలిపారు. 2017 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ సీరియల్ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఎన్నో సంవత్సరాల పాటు అత్యధిక టీఆర్‌పీ రేటింగ్స్ సాధిస్తూ తెలుగు టెలివిజన్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.ఈ సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్క జోడీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పొందింది. ముఖ్యంగా వంటలక్క అనే పేరు ప్రేమి విశ్వనాథ్‌కు శాశ్వత గుర్తింపుగా మారిపోయింది. ఆమె నటన, భావోద్వేగ సన్నివేశాల్లో చూపించిన సహజత్వం ప్రేక్షకులను ప్రతిరోజూ టీవీల ముందు కూర్చోబెట్టింది.

- Advertisement -

ALSO READ:Trisha:త్రిష టంగ్ స్లిప్..రానాను “లేడీస్ మ్యాన్” అంటూ షాకింగ్ కామెంట్!

లాయర్ నుంచి స్టార్ నటిగా:

లీగల్ అడ్వైజర్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రేమి విశ్వనాథ్, మోడలింగ్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, మలయాళంలో గుర్తింపు తెచ్చుకుని, తర్వాత తెలుగులో వంటలక్కగా ఇంటింటికీ చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. ప్రతిభ, కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఆమె కెరీర్ మరోసారి నిరూపించింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you