Thursday, July 9, 2026
HomeLATESTLenin Movie :"లెనిన్"తో తేలనున్న అసలు సత్తా.. ఆ నలుగురికి ఇదే కీలక పరీక్ష!

Lenin Movie :”లెనిన్”తో తేలనున్న అసలు సత్తా.. ఆ నలుగురికి ఇదే కీలక పరీక్ష!

Lenin Movie :అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా ఫలితం హీరోతో పాటు దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడి కెరీర్‌కు కీలకంగా మారనుంది. ఈ సినిమాతో ఎవరి అసలు సత్తా తేలనుందో తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Lenin Movie :నాగార్జున రెండవ కొడుకు అఖిల్ తాజాగా నటించిన సినిమా ‘లెనిన్’. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకుని ఉన్నారో అందరికీ తెలిసిందే. అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయింది. కానీ ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం పడలేదు. ఇంకా పక్కాగా చెప్పాలంటే, “అఖిల్ సత్తా అంటే ఇది” అని అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసే సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా హిట్ అయినా, ఆ క్రెడిట్ మొత్తం పూజా హెగ్డే ఎగరేసుకుపోయిందనే అభిప్రాయం ఉంది. దీంతో ఇప్పుడు పూర్తి ఆశలన్నీ ‘లెనిన్’ సినిమాపైనే పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు.

నాగార్జున సినిమా గుర్తుకు తెస్తున్న లుక్:

‘లెనిన్’ సినిమాలో అఖిల్(Akhil Akkineni) లుక్ చూస్తే నాగార్జున నటించిన ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’ సినిమా గుర్తుకు వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఒక రకంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్‌కు ఈ సినిమా ఫలితం అగ్నిపరీక్షనే చెప్పాలి.పైగా, పెళ్లి తర్వాత విడుదల కాబోతున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా హిట్ అవ్వడం చాలా చాలా ముఖ్యం.

- Advertisement -

అఖిల్ మాత్రమే కాదు.. భాగ్యశ్రీకీ కీలకం:

కేవలం అఖిల్‌కే కాదు, ఈ సినిమా హిట్ అవ్వడం భాగ్యశ్రీ బోర్సేకు కూడా చాలా కీలకం. తెలుగు తెరపై తన అందచందాలతో బాగా దూసుకుపోతున్న భాగ్యశ్రీకి(Bhagyashri Borse, ) ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా తన ఖాతాలో పడలేదు. ఆమె నటించిన తొలి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’, ఆ తర్వాత చేసిన ‘కింగ్డమ్’, ‘కాంత’, అలాగే రామ్ పోతినేనితో నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి సినిమాలు ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఈ సినిమాలకు మంచి టాక్ వచ్చినా, భాగ్యశ్రీ బోర్సేకు మాత్రం పెద్దగా ఉపయోగం కాలేదనే అభిప్రాయం ఉంది.

ఈ సినిమాలన్నీ పీరియాడిక్ మూవీస్ కావడం మరో విశేషం. ఇప్పుడు వస్తున్న ‘లెనిన్’ (Lenin Movie ) కూడా అదే తరహా కథాంశంతో తెరకెక్కడం గమనార్హం. భాగ్యశ్రీ చేసిన సినిమాలన్నీ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో ఆమెపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా హిట్ అయితే ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

నాగవంశీకి కూడా చాలా ముఖ్యమైన సినిమా:

ఇక నిర్మాత నాగవంశీ విషయానికి వస్తే, ఆయన సరైన సాలిడ్ హిట్ అందుకుని చాలా కాలమైందనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఆయన ఖాతాలో పెద్ద విజయాలు పడిన దాఖలాలు లేవు. ‘అనగనగా ఒక రాజు’ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అంతకుముందు వచ్చిన సినిమాల పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే. అటు ‘ఫంకీ’ కూడా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ పరిస్థితులన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు నాగవంశీ నిర్మిస్తున్న ‘లెనిన్’ హిట్ అవ్వడం ఆయనకు కూడా చాలా కీలకం.

also read:Naga Vamshi:బ్లాస్ట్.. పెద్ది సినిమాలపై నిర్మాత నాగవంశీ హాట్ కామెంట్స్

- Advertisement -

మురళీ కిషోర్‌కు మరో ఛాన్స్:

ఇక దర్శకుడు మురళీ కిషోర్ విషయానికి వస్తే, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ పెట్టడం కొంత మైనస్‌గా మారుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. రష్యాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు లెనిన్ పేరు ఈ సినిమాకు ఎందుకు పెట్టారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. టైటిల్ కమ్యూనిజాన్ని సూచిస్తుంటే, సినిమా మాత్రం మహాభారతాన్ని గుర్తు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా విజయంతో మురళీ కిషోర్ టాప్ డైరెక్టర్ల లీగ్‌లో చేరతారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

also read:Naga Vamshi:బ్లాస్ట్.. పెద్ది సినిమాలపై నిర్మాత నాగవంశీ హాట్ కామెంట్స్

జూలై 10న తేలనున్న ఫలితం:

మొత్తానికి ‘లెనిన్’ సినిమా హిట్ అవ్వడం అటు అఖిల్‌కు, ఇటు భాగ్యశ్రీ బోర్సేకు, మరోవైపు నిర్మాత నాగవంశీకి, అలాగే దర్శకుడు మురళీ కిషోర్‌కు చాలా చాలా కీలకం. వీళ్లంతా పడిన కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో తెలియాలంటే జూలై 10 వరకు వేచి చూడాల్సిందే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you