OTT:మలయాళం సినిమాలంటే ఓటీటీ, ఓటీటీ అంటేనే మలయాళ సినిమా అనే స్థాయికి పరిస్థితి మారిపోయింది. సాధారణంగా ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ ఒకటి లేదా రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలలోకి రావడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్‌ఫాంలలోకి స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.3 రేటింగ్ ఉంది. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఇందులో ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
జూలై 10 నుంచి స్ట్రీమింగ్
ప్రతి వారం కచ్చితంగా రెండు మలయాళ సినిమాలైనా ఓటీటీలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మరో మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఇది ఒక సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీ పేరు డోస్ (Dose). అభిలాష్ ఆర్. నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిజ్జు విల్సన్, జగదీష్, అశ్విన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం, జూలై 10 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.
ఏకంగా ఐదు ఓటీటీల్లో అందుబాటులోకి
ఈ సినిమా ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్, లయన్స్‌గేట్ ప్లే వంటి ఐదు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే నిర్మాతలు ఈ మల్టీ-ప్లాట్‌ఫామ్ స్ట్రాటజీని అనుసరించినట్లు తెలుస్తోంది.
also read:NTR:ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు క్రేజీ హీరోయిన్ ఓకే.. బ్లాక్‌బస్టర్ జోడీ మావ ఇది!?
కథ ఏంటంటే?
ఈ సినిమా కథ ఒక ఆసుపత్రిలో వరుసగా జరుగుతున్న అనుమానాస్పద మరణాల చుట్టూ తిరుగుతుంది. కథ చాలా స్పెషల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్ (సిజ్జు విల్సన్) పనిచేసే ఆసుపత్రిలో రోగులు ఒక్కొక్కరుగా వరుసగా చనిపోతూ ఉంటారు. అసలు కారణమేంటో ఎవరికీ తెలియదు. ఎందుకు చనిపోతున్నారో కూడా అర్థం కాదు. కనీసం పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఎలాంటి ఆధారాలు లభించవు. అసలు ఇలా ఎలా హత్యలు చేయగలరు? అనే ఆలోచనలో పడేలా సినిమా ఉంటుంది.
also read:Akhil Akkineni:అఖిల్ ని జైనబ్ అలా పిలుస్తుందా..? ముద్దు పేర్లు భలే వెరైటీగా ఉన్నాయే..!
ఇంటర్వెల్ తర్వాత అసలైన ట్విస్ట్
చివరకు డాక్టర్ ప్రకాష్ భార్య కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతుంది. దీంతో కథ మొత్తం రివర్స్ అవుతుంది. అసలు ఆ హత్యలు చేసింది ఎవరు? వాటి వెనుక కారణం ఏమిటి? హత్యలు చేయడం వల్ల అతనికి ఒరిగింది ఏమిటి? ఇది ఒక సైకో కిల్లర్ చేస్తున్న పని అని అందరూ అనుకుంటారు. అతను ఎవరో తెలుసుకోవడానికి ప్రకాష్ రంగంలోకి దిగుతాడు. అయితే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్ట్ అసలు కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది.
ఉత్కంఠభరితమైన సస్పెన్స్
ఒక పోలీస్ ఆఫీసర్‌తో కలిసి ప్రకాష్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. మరి ఆసుపత్రిలో వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్ ఎవరు? పోలీసులు అతన్ని ఎలా పట్టుకున్నారు? అసలు ఎందుకు కొంతమందినే టార్గెట్ చేశాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను ఓటీటీలో చూడాల్సిందే. క్షణక్షణం ఉత్కంఠను పెంచుతూ, నరాలు తెగే సస్పెన్స్‌తో సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.


