Jabardasth:జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లలో ఒకరే ముక్కు అవినాష్. జబర్దస్త్ (Jabardasth) కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్ (Mukku Avinash ) ఇప్పుడు ఎంత హై పొజిషన్‌లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో ఇంకా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న అవినాష్ ప్రస్తుతం పలు టీవీ ప్రోగ్రామ్‌లు, సినిమాలతో బిజీబిజీగా ఉంటున్నాడు. తాజాగా తన జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటనను జనాలతో పంచుకున్నాడు ముక్కు అవినాష్.
ఎమోషనల్ అయిన అవినాష్:
ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే ముక్కు అవినాష్ జీవితంలో కొన్ని విషాదాలు దాగి ఉన్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘కాకమ్మ కథలు’ పేరుతో ఒక టాక్ షో నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిని ప్రముఖ నటి తేజస్విని మదివాడ హోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ టాక్ షోకు హాజరయ్యాడు అవినాష్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్‌గా పంచుకున్నాడు.
మొదటి బిడ్డను కోల్పోవడమే జీవితంలో అతిపెద్ద విషాదం:
ఇదే క్రమంలో తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. షోలో భాగంగా యాంకర్, “మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషాదకరమైన ఘటన ఏదైనా ఉందా?” అని అడగగా, వెంటనే అవినాష్ ఎమోషనల్ అయిపోయాడు. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయిన అతడు, “ఈ మధ్యకాలంలో నా జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన అయితే నా మొదటి బిడ్డను కోల్పోవడమే. ఆ రోజు నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. ఎలా ఏడ్చానో నాకు తెలియదు. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి. చుట్టూ అందరూ ఉన్నా నాకు ఎవ్వరూ లేరనిపించింది.
ALSO READ:Lenin Movie :”లెనిన్”తో తేలనున్న అసలు సత్తా.. ఆ నలుగురికి ఇదే కీలక పరీక్ష!
డాక్టర్ల కాళ్లపై పడి వేడుకున్నా..
ఆ రోజు ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు కనిపించిన ప్రతి ఒక్కరి కాళ్లపై పడ్డాను. ‘నా బిడ్డను కాపాడండి… కాపాడండి’ అని ఏడ్చాను. వేడుకున్నాను. కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఆసుపత్రి బయట పిచ్చోడిలా అటూ ఇటూ తిరుగుతూ నాకు నేనే ఏం చేస్తున్నానో తెలియలేదు. అసలు నాకు ఎందుకురా ఈ జీవితం అనిపించేంతలా బాధపడ్డాను. రోడ్డుపై పడుకొని మట్టిలో దొర్లాను. నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు.
ALSO READ:Naga Vamshi:బ్లాస్ట్.. పెద్ది సినిమాలపై నిర్మాత నాగవంశీ హాట్ కామెంట్స్
ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది:
ఆ సమయంలో నేను పూర్తిగా కృంగిపోయాను. ఈ బాధను తట్టుకోలేక చాలా రోజులపాటు బయట ప్రపంచానికి కూడా దూరంగా ఉన్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న షూటింగ్ యూనిట్ సభ్యులు మరుసటి రోజు షూటింగ్ కూడా రద్దు చేశారు. నా అనుకున్న వాళ్లు, నా స్నేహితులు ఎంతో అండగా నిలిచారు.” అంటూ చాలా ఎమోషనల్ అవుతూ అప్పటి విషాదాన్ని గుర్తు చేసుకున్నాడు అవినాష్. ఇది విన్న ఫ్యాన్స్ పగవాడికి కూడా ఇలాంటి కష్టం వద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


