Wednesday, July 22, 2026
HomeINTERVIEWSKiraak RP: అందుకే కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు దుకాణం మూసివేశారా?

Kiraak RP: అందుకే కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు దుకాణం మూసివేశారా?

Kiraak RP: జబర్దస్త్ కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న ఆర్పీ తన చేపల పులుసు రెస్టారెంట్ బిజినెస్ క్లోజ్ చేశారు.

on
- Advertisement -banner Ad

Kiraak RP: ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించిన కమెడియన్లలో కిర్రాక్ ఆర్పి కూడా ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో తరచూ రాజకీయంగా ఏదో ఒక విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాడు. ఇక అప్పుడప్పుడు పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న కిరాక్ ఆర్పీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో కిర్రాక్ ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే వ్యాపారాన్ని మొదలుపెట్టారు .అయితే అది ఎందుకు విఫలమయ్యిందనే విషయం పై ఒకానొక సమయంలో కిరాక్ ఆర్పీ(Kiraak RP)క్లారిటీ ఇచ్చారు.

చేపల పులుసు బిజినెస్ క్లోజ్ చేసిన కిర్రాక్ ఆర్పీ..

కిరాక్ ఆర్పీ మొదటి నాలుగు ఐటమ్స్ తో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు.. చాలా ప్రాంతాలలో కూడా వీటిని ప్రారంభించారు. క్వాలిటీ, టేస్ట్ మైంటైన్ చేస్తూ బాగానే పేరు సంపాదించారు కిర్రాక్ ఆర్పీ. అంతేకాకుండా తన కర్రీ పాయింట్ కి ఊహించని విధంగా రెస్పాన్స్ లభించడంతో అక్కడికి వచ్చే జనాన్ని ఆపలేక కొంతమంది బౌన్సర్లను కూడా నియమించుకున్నాడు కిరాక్ ఆర్పి. అలా కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకున్నారు.అయితే క్వాలిటీతో పాటుగా ధరల విషయంలో పలు రకాల విమర్శలు కూడా వినిపించాయి. వాటిని పట్టించుకోకుండా వరుసగా బ్రాంచ్లు ఓపెన్ చేసేసారు. మరి కొన్నిచోట్ల డబ్బు కట్టిన వారికి కూడా బ్రాంచ్లు అప్పగించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Jabardasth:ముక్కు అవినాష్ జీవితంలో అతిపెద్ద విషాదం.. పగవాడికి కూడా ఇలాంటి కష్టం వద్దు సామీ!

అసలు కారణం ఏమిటంటే?

ఆ తర్వాత కాలంలో వ్యాపారం సరిగ్గా నడవకపోవడం, చేపల పులుసు టేస్ట్ సరిగ్గా లేకపోవడంతో చాలామంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు. అలా నెమ్మదిగా అన్ని బ్రాంచ్ లు మూతపడ్డాయి. ముఖ్యంగా చేపల పులుసు తయారు చేయడానికి కూడా ప్రత్యేకించి నెల్లూరు నుంచి కొంతమంది వ్యక్తులను పిలిపించేవారు. అంతేకాకుండా అక్కడి నుంచి మసాలా దినుసులను కూడా తెప్పించేవారు..అయితే కిరాక్ ఆర్పి కెరియర్ లో ఈ ఫుడ్ బిజినెస్ కేవలం ఒక పార్ట్ మాత్రమే అని , అలాగే రాజకీయాలు కూడా ఒక భాగమని రాజకీయాలలో బిజీ అవ్వడం చేత చేపల పులుసు బిజినెస్ నుంచి తాను విరమించుకున్నాను అంటూ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Lenin Movie :”లెనిన్”తో తేలనున్న అసలు సత్తా.. ఆ నలుగురికి ఇదే కీలక పరీక్ష!

అధికారం లభిస్తుందా?

ఇక టిడిపి పార్టీలో తనకి ఏదైనా బాధ్యత ఇస్తే తీసుకునేందుకు కూడా సిద్ధంగానే ఉన్నానని.. తన స్థాయి, అర్హత బట్టి ఏది ఇచ్చినా కూడా బాధ్యత తోనే పని చేస్తానంటూ తెలియజేశారు. ఇప్పటికీ కిరాక్ ఆర్పి టిడిపిలో యాక్టివ్ గా ఉంటూ పనిచేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you