Friday, July 10, 2026
HomeLATESTAllu Arjun-Lokesh Movie: పుష్పరాజ్‌ను మించే అవతార్‌లో బన్నీ.. లుక్ టెస్ట్‌పై క్రేజీ అప్డేట్..!

Allu Arjun-Lokesh Movie: పుష్పరాజ్‌ను మించే అవతార్‌లో బన్నీ.. లుక్ టెస్ట్‌పై క్రేజీ అప్డేట్..!

Allu Arjun-Lokesh Movie: పుష్ప తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న లోకేష్ కనగరాజ్ సినిమా నుంచి లుక్ టెస్ట్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. పుష్పరాజ్‌ను మించే కొత్త అవతార్‌లో బన్నీ కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

on
- Advertisement -banner Ad

Allu Arjun-Lokesh Movie:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత తన రేంజ్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. పుష్ప సినిమా ముందు వరకు అల్లు అర్జున్ అంటే బాగా డాన్స్ చేస్తాడు, బాగా నటిస్తాడు అంతే. కానీ పుష్ప తర్వాత మాత్రం అల్లు అర్జున్ అంటే సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు, ప్రాణాలకు తెగించి రిస్కీ షాట్స్‌లో నటిస్తాడు అని జనాలు మాట్లాడుకునేలా చేసుకున్నాడు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పేరు గ్లోబల్ స్థాయిలో మార్మోగిపోతోంది.

అట్లీ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్:

ప్రస్తుతం అట్లీ (atlee)దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్(Allu Arjun). ఈ సినిమా షూటింగ్‌ను సర్వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు కమిట్ అయ్యాడు అల్లు అర్జున్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

- Advertisement -

లుక్ టెస్ట్‌పై అధికారిక అప్డేట్:

ఈ సినిమా ఏ కాన్సెప్ట్‌లో ఉండబోతోంది? హీరోయిన్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వంటి విషయాలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. లుక్ టెస్ట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. లుక్ టెస్ట్ షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసిందని, అల్లు అర్జున్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్‌తో ఈ చిత్రంలో కనిపించబోతున్నారని ఇన్‌సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

also read:Vk.Naresh:రావణ్ అరెస్టు ఎఫెక్ట్.. సోషల్ మీడియా యూజర్లకు నరేష్ సీరియస్ వార్నింగ్..!

- Advertisement -

బన్నీని ఎలా చూపించబోతున్న లోకేష్?

లోకేష్ కనగరాజ్(Lokesh) తన సినిమాల్లో హీరోలను ఎంత పవర్‌ఫుల్‌గా, వైల్డ్‌గా చూపిస్తారో గత సినిమాలు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో బన్నీని ఎలా చూపించబోతున్నారు? లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో పుష్పరాజ్‌కు భిన్నమైన బ్యాక్‌గ్రౌండ్ ఏ విధంగా ఉండబోతోంది? అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది.

also read:Samantha:టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం.. సమంత సెన్సేషనల్ డెసీషన్..!?

- Advertisement -

త్వరలో బీహైండ్ ది సీన్స్ వీడియో:

ఈ లుక్ టెస్ట్ ప్రక్రియ సినిమా మేకింగ్‌లో కొత్త కోణాన్ని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ సెట్స్‌కు సంబంధించిన బీహైండ్ ది సీన్స్ వీడియోను త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

యాక్షన్ సీన్స్‌పై భారీ హైప్:

సాధారణంగా లోకేష్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ హై లెవెల్‌లో ఉంటాయి. ఇక అల్లు అర్జున్‌తో ఆయన తెరకెక్కించే యాక్షన్ సీన్స్ అంటే ఊహించుకుంటుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయని అభిమానులు అంటున్నారు. అంతలా ఈ కాంబోపై అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కమర్షియల్ హంగులతో పాటు సాంకేతికంగా కూడా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ స్క్రీన్‌ప్లే, బన్నీ స్టైల్ కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఫ్యాన్స్‌లో పెరుగుతున్న క్యూరియాసిటీ:

ఈ మాస్టర్‌పీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, ఇప్పటివరకు అల్లు అర్జున్ చేయని ఒక రిస్కీ పనిని ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ చేయించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సినిమా సెట్స్‌పైకి వచ్చేలోపు ఒక్కో అప్డేట్‌తో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచాలని లోకేష్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే ఇలా ఒక్కొక్క అప్డేట్‌ను విడుదల చేస్తూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. వీళ్లిద్దరి మ్యాజిక్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you