Thursday, July 9, 2026
HomeLATESTSamantha:టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం.. సమంత సెన్సేషనల్ డెసీషన్..!?

Samantha:టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం.. సమంత సెన్సేషనల్ డెసీషన్..!?

Samantha:స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన సినీ కెరీర్‌లో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. మహిళా ప్రధాన కథలకు ప్రాధాన్యం ఇస్తూ, బలమైన మహిళా పాత్రలతో కూడిన సినిమాలను ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు

on
- Advertisement -banner Ad

Samantha:ఎస్, ప్రెజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో అదే విధంగా టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో మరొకసారి తానేంటో ప్రూవ్ చేసుకున్న హీరోయిన్ సమంత(Samantha) ఇప్పుడు సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ‘మా ఇంటి బంగారం’ విజయంతో దూసుకుపోతున్న సమంత కొంతకాలం పాటు కమర్షియల్ మాస్ చిత్రాలకు దూరంగా ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ కొంతకాలం కాదు, ఇక పూర్తిగా సమంత గ్లామరస్ అనే పదానికి దూరం కాబోతుందన్న టాక్ వినిపిస్తుంది.

ఉమెన్ సెంట్రిక్ సినిమాలపై మాత్రమే దృష్టి:

లేటెస్ట్‌గా అందుతున్న సమాచారం ప్రకారం, ఇకపై సమంత కేవలం ఉమెన్ సెంట్రిక్ సినిమాలపై మాత్రమే దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గ్లామర్ పాత్రలు, లేకపోతే స్టార్ హీరోల సినిమాల్లో పరిమితంగా ఉండే పాత్రలు చేయదట. కథతోనే తన పాత్రకి ప్రధాన శక్తిగా నిలిచే స్టోరీస్‌ను ఆమె ఇక ఫైనలైజ్ చేయాలని డిసైడ్ అయిందట. ఇన్నాళ్లు సమంత రెండో పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అంటూ కంగారు పడ్డారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా తర్వాత సమంత సినిమాల్లో నటిస్తుందిలే అని ఆశపడ్డారు. సినిమా ప్రమోషన్స్‌లో ఆమె ప్రెగ్నెన్సీ రూమర్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. ఆ తర్వాత అది రూమర్ కాదు, నిజమే అంటూ సమంత కచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బేబీ డెలివరీ తర్వాత కచ్చితంగా మళ్లీ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తానని సమంత చెప్పుకొచ్చింది.

- Advertisement -

also read:Janhvi Kapoor: రాయల్ లుక్ లో మెస్మరైజ్ చేసిన జాన్వీ కపూర్.. అవుట్ ఫిట్ ప్రత్యేకత ఏంటంటే?

ప్రేక్షకులతో నేరుగా అనుసంధానం:

ఆ సినిమాలు కేవలం ఉమెన్ సెంట్రిక్ సినిమాలుగానే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుందట. ఇప్పటికే దాని గురించి కథలు కూడా వింటుందట సమంత. ఓకే చెబితే కమర్షియల్ అవకాశాలు రెడీగా ఉంటాయి, కానీ సమంత కావాలనే వాటిని పక్కన పెడుతూ తానేంటో, తన నటన ఏంటో, తన టాలెంట్ ఏంటో చూపించాలని అనుకుంటుంది. తన పాత్ర చుట్టూ కథ తిరుగుతున్నప్పుడు ప్రేక్షకులతో నేరుగా అనుసంధానం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని శ్యామ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

also read:Colors Swathi: రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ కలర్స్ స్వాతి!

దీని వెనక తన భర్త రాజ్ నిడమూరు:

ఈ నిర్ణయం ఆమెలోని కళాకారిణిని మరింత ఆవిష్కరించే ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే దీని వెనక తన భర్త రాజ్ నిడమూరు(Raj nidimoru) కూడా ఉన్నారని అంటున్నారు శ్యామ్ అభిమానులు. ఆయన మంచి రైటర్. శ్యామ్ కోసం మంచి మంచి స్టోరీస్ రాస్తే ఇండస్ట్రీలో ఈ జంట పేరు దూసుకుపోతుందని సలహా ఇస్తున్నారు. చాలామంది హీరోయిన్లు పెళ్లి అయిన తర్వాత సినిమాల్లోకి వస్తారు. వాళ్లకు వచ్చిన ఆఫర్లలో ఏదో ఒకటి చేసుకుంటూ పోతారు. కానీ సమంత మాత్రం ట్రెండ్ సృష్టిస్తుంది. వచ్చిన ఆఫర్లను కాకుండా, ఆఫర్లు దక్కించుకునే ట్రెండ్ సెట్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.

- Advertisement -

చూడాలి మరి సమంత, రాజ్ నిడమూరు ఇండస్ట్రీని ఎలా దున్నేస్తారో. ప్రెజెంట్ సమంతకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you