Sunday, July 26, 2026
HomeLATESTPrabhas Srinu :నా జీవితంలో ప్రభాస్ దేవుడే.. టాలీవుడ్ కమెడియన్ కామెంట్స్!

Prabhas Srinu :నా జీవితంలో ప్రభాస్ దేవుడే.. టాలీవుడ్ కమెడియన్ కామెంట్స్!

Prabhas Srinu: రెబల్ స్టార్ ప్రభాస్ ఒక టాలీవుడ్ కమెడియన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Prabhas Srinu :టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పేరు సంపాదించిన ప్రభాస్ శ్రీను గురించి చెప్పాల్సిన పనిలేదు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రభాస్ శ్రీను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ ప్రయాణంలో ప్రభాస్ తో ఉన్న అనుబంధం గురించి పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా తనకు వచ్చిన గుర్తింపు మొత్తం ప్రతిభ కంటే అదృష్టం వల్లే ఎక్కువగా వచ్చిందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అలాగే ప్రభాస్ తో పరిచయం, తన జీవితాన్ని ఎలా మార్చేసింది? అనే విషయాలను కూడా పంచుకున్నారు.

నాకు అవకాశాలు వచ్చింది అదృష్టం తోనే..

ప్రభాస్ శ్రీను (Prabhas Srinu )మాట్లాడుతూ.. “నాకు వచ్చిన ఈ గుర్తింపు కేవలం నా టాలెంట్ వల్ల మాత్రమే కాదు ఇది పూర్తిగా నా అదృష్టమే ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ కూడా టాలెంట్ ఉంటుంది. అయితే అందరికీ అలాంటి అవకాశాలు రాలేవు. నా జీవితంలో మాత్రం ప్రభాస్ ను కలవడం ఒక పెద్ద లక్ అని చెప్పారు. తాను ప్రతిరోజు స్నేహితులతో కలిసి బైక్ రైడింగ్, బ్యాట్మింటన్ ఆడడం ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లడం అక్కడి నుంచి ప్రభాస్ తో కలిసి ప్రయాణాలు చేయడం వంటివి రోజూ జరిగేవని తెలియజేశారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Dhruv Vikram:వివాదంలో చిక్కుకున్న విక్రమ్ కొడుకు..!

ప్రభాస్ గొప్పతనం మాటల్లో చెప్పలేం..

అలాగే ఒక వైపు సాధారణ జీవితం మరొకవైపు పాన్ ఇండియా స్టార్ హీరోతో కలిసి ప్రపంచమంతా ట్రావెల్ చేయడం ఈ రెండు అనుభవాలు కూడా నా జీవితంలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తానంటూ తెలిపారు ప్రభాస్ శ్రీను. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. “ప్రభాస్ చుట్టూ చాలామంది ఉంటారు. కానీ ఆయనకు ఎవరు దగ్గరవుతారనేది చెప్పడం చాలా కష్టం. ప్రభాస్ కి నిజాయితీగా ఉండడమంటే చాలా ఇష్టం. ఆయన చాలా తెలివైన వ్యక్తి. ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా గమనిస్తూ ఉంటారని తెలిపారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Varanasi:హమ్మయ్య..రాజమౌళి నెత్తిన పెద్ద భారం దిగ్గిపోయింది..వారణాసికి లైన్స్ క్లియర్‌..!

ఆయన నా జీవితంలో దేవుడు..

మా ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడిందో తాను చెప్పలేను.. కానీ ప్రభాస్ ని దేవుడితో పోల్చడంపై స్పందిస్తూ నేను ఆయన ఫ్రెండ్, మేనేజర్ ,ఇంకేదైనా బంధువా అనే విషయం చెప్పలేను. నేను ఆయనతో ఉండడం అవసరమైనప్పుడు సేవ చేయడం వరకే నాకు తెలుసు. నా జీవితంలో ఆయన స్థానం దేవుడు లాంటిది అంటూ తెలియజేశారు. అలాంటి బంధం గురించి తాను మాటల్లో చెప్పడం చాలా కష్టమంటూ ఎమోషనల్ గా మాట్లాడారు ప్రభాస్ శ్రీను.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you