akkineni family:సినీ పరిశ్రమలో కుటుంబ ఆస్తుల విషయంలో వివాదాల కొత్త విషయం ఏమీ కాదు. పలువురు ప్రముఖ కుటుంబాలల్లో వారసత్వ ఆస్తులపై విభేదాలు బయటకు వచ్చిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే అక్కినేని కుటుంబంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. దీనిపై రీసెంట్గా హీరో అక్కినేని అఖిల్ స్పందించారు. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న అఖిల్ తన అన్న నాగచైతన్యతో తమ బంధం ఎంతో బలంగా ఉంది అని.. ఆస్తి కోసం తమ మధ్య ఎలాంటి విభేదాలు తరిస్తే అవకాశం లేదు అని చెప్పాడు.
తండ్రి నేర్పిన విలువలే బలం :
అఖిల్ మాట్లాడుతూ తమ తండ్రి నాగార్జున (akkineni family)చిన్నప్పటినుంచి డబ్బు లేదా ఆస్తుల కంటే కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. మా నాన్న ఎప్పుడు ఎవరికి ఎంత ఆస్తి ఇవ్వాలి అనే విషయం గురించి మాట్లాడలేదు ..జీవితంలో ప్రతి ఒక్కరు తమ సొంత కష్టంతో ఎదగాలని మాత్రమే చెప్పేవారు. తను సంపాదించిన ఆస్తిని ఎలా పంచాలి అనేదొ ఆయనకి పూర్తి అవగాహన ఉంది.. అందుకే ఆ విషయంపై మాకు ఎలాంటి ఆందోళన కూడా లేదు అని చెప్పుకొచ్చాడు.
also read:Avika Gor: పింక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న అవికా గోర్!
బతికున్నంత వరకు ఒక్క రూపాయి కూడా రాదు:
తమ తండ్రి ఎప్పుడు ఒకే విషయం చెప్పే వారిని అఖిల్(akhil) వెల్లడించాడు. నేను బతికున్నంత వరకు మీకు నా ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా రాదు. మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి. అవసరమైతే మార్గదర్శకత్వం ఇస్తాను కానీ నా డబ్బుతో మిమ్మల్ని నిలబెట్టను అని నాగార్జున చెప్పేవారని అఖిల్ వివరించారు. ఈ ఆలోచన వల్లే తాము చిన్నప్పటి నుంచే స్వతంత్రం గా నిలబడే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
also read:Kajal Agarwal:కారవాన్ లో అభిమాని దెబ్బకు భయపడిన కాజల్ అగర్వాల్..!
మా ఇంటి సాంప్రదాయం అదే :
అక్కినేని కుటుంబంలో ఈ విధానం కొత్తది కాదు. తమ తాత కాలం నుంచే ఇదే సాంప్రదాయం కొనసాగుతుందని అఖిల్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరు ఉచితంగా డబ్బు తీసుకోలేదు అని.. ప్రతి ఒక్కరు తమ ప్రతిభతోనే కెరియర్ను నిర్మించుకున్నారని వివరించాడు. నా సంపాదన నాది అన్నయ్య సంపాదన ఆయనది.. మేమిద్దరం కూడా మా కష్టార్జితంతోనే జీవిస్తున్నాం అని స్పష్టం చేశాడు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాయి.




