Monday, July 27, 2026
HomeLATESTPooja Hegde:పూజా హెగ్డే ఇల్లు చూశారా?

Pooja Hegde:పూజా హెగ్డే ఇల్లు చూశారా?

Pooja Hegde: ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా తన ఇంటి వీడియోని రిలీజ్ చేయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

on
- Advertisement -banner Ad

Pooja Hegde:టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే గురించి చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. కోలీవుడ్, హిందీ వంటి భాషలలో మాత్రమే పలు సినిమాలలో నటిస్తోంది. తెలుగులో మరి అవకాశాలు రాలేదో లేకపోతే ఇవ్వలేదో తెలియదు కానీ పెద్దగా కనిపించడం లేదు. ఇటీవలే విజయ్ నటించిన జననాయగన్ చిత్రంలో కూడా నటించిన పూజా హెగ్డే కు(Pooja Hegde) పెద్దగా కలిసి రాలేదు. కానీ పూజ హెగ్డే గురించి మాత్రం ఏదో ఒక విషయం వినిపిస్తూ ఉంటుంది. తాజాగా పూజ హెగ్డే గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన పూజా హెగ్డే..

అదేమిటంటే పూజ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తోందని, 2004లో రూ. 50 కోట్లతో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినట్లుగా వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా తన ఇంటికి సంబంధించిన వీడియోని యూట్యూబ్ లో షేర్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ ఇల్లు చూసిన చాలా మంది నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ ఇంటికి ఉన్న ఇంటీరియర్స్ డిజైనర్ ఫర్నిచర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Ram Charan:హీరో రామ్ చరణ్ కు సర్జరీ.. ఎందుకంటే?

లండన్ తరహాలో ప్రత్యేక ప్రవేశ మార్గం..

పూజా హెగ్డే ఇంటి ఎంట్రెన్స్ చూస్తే మాత్రం పూర్తిగా తెల్లని గోడ లాగా ఒక ఆకుపచ్చ తలుపుతో ఉంటుంది. అయితే ఇది లండన్ తరహాలో ప్రవేశ మార్గం ఉండేలా నిర్మించుకున్నట్లు తెలిపింది పూజా హెగ్డే . ఈ ఇల్లు సముద్రానికి ఎదురుగా ఉండడమే కాకుండా ఇంటి లోపల ఉండే వస్తువులను చూస్తే చాలా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. పూజా హెగ్డే తన గదిని చాలా ప్రత్యేకించి మరీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఆమె చదవడానికి , విశ్రాంతి తీసుకోవడానికి ఉండేలా ఎల్ ఆకారపు సోఫాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi:గబ్బర్ సింగ్ నటుడుకి సహాయం చేసిన మెగా ఫ్యామిలీ!

ప్రత్యేకతలు తెలిస్తే షాక్..

పూజా హెగ్డే ఇంట్లో ఒక వాక్ ఇన్ క్లోసెట్ కలదు.. ఇది ఒక చిన్నపాటి గది వంటిది. ఇందులో నేల నుండి పైకప్పు వరకు ఖరీదైన బూట్లు , బ్యాగులు , బట్టలు ఉంటాయి.. దీనిని పూజా హెగ్డే వర్కు స్పేస్ అని కూడా పిలుస్తుంది. ముఖ్యంగా పూజా హెగ్డే నిర్మించుకున్న ఇంటిని చూసి అభిమానులు తెగ లైక్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు . ముఖ్యంగా ఈమె ఇంటి వాతావరణం , అందమైన డిజైన్ అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you