Posani :టాలీవుడ్ లో నటుడుగా, రచయితగా, డైరెక్టర్గా , రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించిన నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలు ఈయన చెప్పే డైలాగుల వల్లే హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సుమారుగా 150కి పైగా చిత్రాలలో నటించిన పోసాని.. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ అరుణారెడ్డితో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు రకాల ఇంటర్వ్యూలకు హాజరయ్యారు పోసాని. తన పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాల గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
పల్నాటి బ్రహ్మనాయుడు మూవీ ఫ్లాప్ పై పోసాని కామెంట్స్..
పోసాని కృష్ణ మురళి(Posani )మొదట రైటర్ గానే తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించిన ఈయన.. తన కథతోనే తెరకెక్కించిన పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రం ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. అంతేకాకుండా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు కూడా లాజిక్కుకు దూరంగా కనిపిస్తాయి. అందుకే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని క్లిప్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటాయి. ఈ విషయం పైన తాజాగా పోసాని మాట్లాడుతూ.. పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా ఫ్లాప్ కావడం పైన పలు విషయాలను తెలియజేశారు.
also read:Adipurush: ఆదిపురుష్ విషయంలో చాలా తప్పు చేశా.. రచయిత షాకింగ్ కామెంట్స్..!
అలా చేయడం నాకు నచ్చదు – పోసాని
బాలకృష్ణ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రానికి కథ నేనే అందించాను.. మొదట బి.గోపాల్ గారు , బాలకృష్ణ గారు ఈ కథ విని నచ్చడంతో సెట్స్ పైకి తీసుకువెళ్లారు.. ముఖ్యంగా గోపాల్ గారికి కథ నచ్చకపోతే కచ్చితంగా తిరస్కరిస్తారు. అసలు నచ్చని కథతో ఆయన సినిమాని చేయరు కదా.. నచ్చిన తరువాతే ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ తర్వాతి పనులను పరుచూరి బ్రదర్స్ నిర్వహించారు.. సినిమా హిట్ అయితే కథ నేను ఇచ్చాను అని చెప్పుకొని ఫ్లాప్ అయితే కథలో మార్పులు చేశారని చెప్పడం నాకు అసలు నచ్చదని తెలిపారు.
also read:Adarsha kutumbam:ఆదర్శ కుటుంబం సినిమా నుంచి చిట్టిబాబు వీడియో వైరల్..!
నావల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది – పోసాని
పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమా కథ ఒక చెత్త కథ. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి పూర్తి బాధ్యత కూడా నాదే. ఆ విషయంలో ఒప్పుకుంటానని పోసాని తెలియజేశారు. ఆ సినిమా స్టోరీని పల్నాటి యుద్ధం నేపథ్యంలో బ్రహ్మనాయుడు నాగులమ్మ పాత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాము ఇందులో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.




