Tuesday, July 28, 2026
HomeLATESTJr NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. షూటింగ్లో గాయం!

Jr NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. షూటింగ్లో గాయం!

Jr NTR : ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా సమయంలో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

on
- Advertisement -banner Ad

Jr NTR : టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుసగా చాలామంది సెలబ్రిటీలు గాయాల పాలవుతున్నారు. ఇటీవల కాలంలో మెగా హీరో రామ్ చరణ్ సర్జరీ కూడా పూర్తి అయినట్లు తెలిసిందే.. అలాగే హీరో వరుణ్ తేజ్ కు కూడా కాలికి గాయమై చేతికర్రతో కనిపించారు. హీరో నందమూరి బాలకృష్ణకి కూడా ఇటీవలే కాలికి గాయం అవ్వడంతో సర్జరీ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఇటువంటి తరుణంలోని తాజాగా జూనియర్ ఎన్టీఆర్(Jr NTR )కి కూడా గాయమైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ఎన్టీఆర్ టీం ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఎన్టీఆర్ భుజానికి గాయం..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో భుజానికి గాయం అయిందని వెంటనే హాస్పిటల్ కి చిత్ర బృందం తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా ప్రకటన చేసింది. ఎన్టీఆర్ టీం ప్రకటించిన ఈ ప్రకటనలో.. “ఈరోజు సాయంత్రం ఎన్టీఆర్ గారి భుజానికి దురదృష్టవశాత్తు గాయం అయ్యిందని, ఈ విషయానికి చింతిస్తున్నామని, ప్రముఖ వైద్యుల బృంద నేపథ్యంలోనే సమగ్ర వైద్య పరీక్షలు చేసారని, అనంతరం పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి 8 వారాలపాటు విశ్రాంతి అవసరం” అంటూ సూచించారు. అభిమానులు ఎవరు కూడా ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ వివరణ ఇచ్చారు

- Advertisement -
Advertisement

ALSO READ:OTT Crime: మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లతో తిరిగొస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సీజన్ 2.. ఈసారి మరింత డేంజర్!

డ్రాగన్ మూవీ వాయిదా..

పూర్తిగా ఆరోగ్యంతో కోలుకున్న తర్వాతే మళ్ళీ అధికారిక సమాచారాన్ని తెలియజేస్తామని తెలిపారు. అసలు ఎన్టీఆర్ కి ఎలాంటి గాయం అయింది? ఆపరేషన్ జరిగిందా లేదా అనే విషయాలు తెలియజేయకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మొత్తానికి డ్రాగన్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఎన్టీఆర్ పేరు ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:’చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

తరచూ వార్తల్లో నిలుస్తున్న ఎన్టీఆర్..

గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ రా సంస్థ చేసిన పనులు ప్రచారాలతో కూడా వార్తలలో నిలిచారు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ కి గాయం అవ్వడంతో ఇప్పుడు మరోసారి వార్తలలో నిలిచారు. ఎన్టీఆర్ చివరిగా వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాగా.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో పాటు త్రివిక్రంతో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో గుర్తుండిపోయే పాత్రలో నటించబోతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you