Friday, July 31, 2026
HomeLATESTRamayana trailer:విజువల్ వండర్ గా రామాయణం ట్రైలర్..!

Ramayana trailer:విజువల్ వండర్ గా రామాయణం ట్రైలర్..!

Ramayana trailer: రణబీర్ కపూర్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణం సినిమా నుంచి బ్రహ్మ ముహూర్తంలో ట్రైలర్ను విడుదల చేశారు.

on
- Advertisement -banner Ad

Ramayana trailer:దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన సాయి పల్లవి ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులను చేస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా తన సహజమైన నటనతో, అందంతో ఎంతమంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి , తాజాగా బాలీవుడ్లో 4000 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణం(Ramayana trailer). ఈ చిత్రాన్ని డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో యశ్ నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ కూడా అంచనాలను పెంచేసింది.

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్..

తాజాగా చిత్ర బృందం గడిచిన కొన్ని గంటల క్రితం ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో అద్భుతంగా కనిపించారు. సాయి పల్లవి కూడా సీతాదేవి పాత్రలో మరింత ఆకట్టుకుంది. రావణుడిగా యశ్ అద్భుతమైన నటన కనబరుస్తున్నట్లు ట్రైలర్లో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్, గ్రాఫిక్స్ వంటివి కూడా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ కూడా ట్రోల్ చేయడానికి ఆస్కారం కనిపించడం లేదని పలువురు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. రామాయణ మొదటి భాగాన్ని 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Jai Krishna:ఘట్టమనేని వారసుడి వెండితెర ఎంట్రీ.. శ్రీనివాస మంగాపురం రివ్యూ & రేటింగ్

అద్భుతంగా నటించిన నటీనటులు..

రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయిలోని విజువల్స్ ఎఫెక్ట్ వాటి అంశాలు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. సూర్పనఖ పాత్రలో రకుల్ ప్రీతిసింగ్, మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సినిమా ట్రైలర్ ఒక విజువల్ వండర్ గా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఆ విషయంలో సక్సెస్ అయ్యారని కూడా నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి ట్రైలర్ తో ఆకట్టుకున్న రామాయణం చిత్రం విడుదలైన తర్వాత ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

also read:Pragya Jaiswal: హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య బ్యూటీ!

సాయి పల్లవి తదుపరి చిత్రాలు..

సాయి పల్లవి మరో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రమే OM: చాప్టర్ 1.. ఈ చిత్రం 2026 అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు. అలాగే రామాయణం పార్ట్ 2 చిత్రంలో కూడా నటించబోతోంది. యశ్ నటించిన టాక్సిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది త్వరలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you