Friday, September 18, 2026
HomeLATESTYouTuber Vaishnavi:నడిరోడ్డుపై యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య..!

YouTuber Vaishnavi:నడిరోడ్డుపై యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య..!

YouTuber Vaishnavi: యూట్యూబర్ వైష్ణవి హత్య సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె భర్త కూడా అంతే దారుణంగా హత్య చేయబడ్డాడు.

on
- Advertisement -banner Ad

YouTuber Vaishnavi:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం రోజున ఒక దారుణ హత్య జరిగింది. ఈ ఏడాది మార్చి 17 న ప్రముఖ యూట్యూబర్ వైష్ణవినీ చంపిన కేసులో ఈమె భర్త (చిత్తారి హరిబాబు) మొదటి ముద్దాయిగా ఉన్నారు. అయితే ఇతడిని వైష్ణవి చిన్నాన్న కుమారుడు గంధం సంతోష్ నడిరోడ్డు పైనే నరికి చంపారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తోంది. మంచినీళ్ల కోసం హరిబాబు ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి వెళుతూ ఉండగా.. కారులో నుంచి వచ్చిన వ్యక్తి హరిబాబు మెడ, తలపై పలుసార్లు కత్తితో నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వైష్ణవి భర్తను దారుణంగా హత్య చేసిన వైష్ణవి సోదరుడు..

అనంతరం నిందితుడు అదే కారులో తిరిగి పారిపోయారు. అయితే అనూహ్యంగా గురువారం రాత్రి ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేసిన నిందితుడు సంతోష్.. తన చెల్లిని చంపినందుకే హరిబాబుని హత్య చేశానంటూ తెలిపారు. పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లుగా కూడా ప్రకటించారు. అనంతరం కోరుట్ల పోలీస్ స్టేషన్ ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. గడిచిన 15 రోజుల క్రితం హరిబాబుని చంపుతానంటూ ఒక వీడియోలో కొంతమంది హెచ్చరించారని అన్నట్టుగానే హతమార్చినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Tollywood:సినిమాలో హీరో హీరోయిన్ పెళ్లి సీన్.. నిజంగానే మూడు ముళ్లు వేస్తారా?

గర్భవతి అని చూడకుండా వైష్ణవిని చంపిన భర్త..

కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దుర్గా ప్రతాప్, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు వైష్ణవి ఉన్నారు. యూట్యూబర్గా మంచి పాపులారిటీ సంపాదించిన వైష్ణవిను(YouTuber Vaishnavi).. కోరుట్ల కు చెందిన సిద్ధారి హరిబాబు యూట్యూబ్ వీడియోలలో చూసి ప్రేమించి మరీ వెంటపడి పెళ్లి చేసుకున్నారు. అలా 2025లో ఆగస్టులో పెద్దలు అంగీకారంతో వివాహం చేసుకున్న అనంతరం వైష్ణవి, హరిబాబు అత్తారింట్లో ఉండగా.. కొన్ని రోజులకు ఎక్కడ ఉండాలనే విషయంపై ఇరువురి కుటుంబాల మధ్య కలహాలు మొదలయ్యాయి. ఆ సమయంలో వైష్ణవి గర్భం దాల్చడంతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. ఇదే క్రమంలో ఐదు నెలలు గర్భవతిగా ఉన్న వైష్ణవిని .. మార్చి 17 రాత్రి ఆమె పుట్టింట్లోనే హింసించి మరీ చంపేశారు హరిబాబు.

- Advertisement -
Advertisement

also read:OTT Movies:ఒక్కరోజే 20 ఓటీటీ రిలీజ్‌లు.. ఈ వీకెండ్ మిస్ అవ్వకండి!

నా చెల్లికి పట్టిన గతి మరెవరికీ పట్టకూడదు..

ఈ కేసులో సుమారుగా మూడు నెలల పాటు జైలులో ఉన్న హరిబాబు జులై నెలలో బెయిల్ మీద బయటకు వచ్చారు. అలా మూడు నెలల పాటు తలదాచుకున్న హరిబాబు మూడు రోజుల క్రితం నిజామాబాదులో ఉంటూ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న తన తల్లి వద్దకు వచ్చారు.. తన చెల్లికీ పట్టిన గతి మరెవరికి పట్టకూడదంటూ హరిబాబును చంపేశానని సంతోష్ సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా వైష్ణవి విషయంలో గవర్నమెంట్ నాకు న్యాయం చేయలేదు.. నేను కావాలని హత్య చేయలేదు.. వేరే పనిమీద నిజామాబాద్ కి వెళ్లగా అక్కడ అనుకోకుండా నాకు హరిబాబు కనిపించడంతో చంపేశాను. నాకు శిక్ష పడకుండా ప్రజలు కాపాడాలని తెలిపారు. ఆ సమయంలోనే సంతోష్ భార్య ఒక సెల్ఫీ వీడియోతో వైష్ణవిని చంపిన వ్యక్తి చనిపోయినందుకు ఆనందంగా ఉంది. కానీ తన భర్త ఇలా చేస్తాడు అనుకోలేదు అంటూ తెలిపింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you