Tollywood:చాలామంది సినిమాల పిచ్చితో అవకాశాల కోసం ఎన్నో ఏళ్ళు పోరాడి మరీ అవకాశం లభించిన తర్వాత వారు చేసే పనుల వల్ల కొన్నిసార్లు వైరల్ గా మారుతుంటారు. అలా సాధారణ యువకుడి కల నెరవేరడంతో ఆ ఆనందం ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి ఆనందం ఇప్పుడు హుషారు పిట్టలు మూవీ ప్రెస్మీట్లో ప్రత్యక్షంగా కనిపించింది. ఈ సినిమాలో పుట్టా భానుగా నటించిన నటుడు భాను మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడిన ఈ మాటలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
స్టేజ్ పైనే పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు..
ముఖ్యంగా నటుడు.. ఇది కలో.. నిజమో అర్థం కావడం లేదంటూ తనని తాను పొట్టు పొట్టున చెంప మీద కొట్టుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఈవెంట్లో భాను మాట్లాడుతూ..” నాకు చిన్నప్పటినుంచి సినిమాలు అంటే చాలా ఇష్టము. ఊరిలో ఎలాంటి సినిమా పడ్డా కూడా మొదటి షో ధియేటర్లోకి వెళ్లేవాడిని.. స్క్రీన్ మీద కామెడీ చూసి నవ్వుకునే నేను హుషారు పిట్టలు రివ్యూ చూస్తున్నప్పుడు పెద్ద స్క్రీన్ మీద నన్ను చూసి జనాలు నవ్వుతూ ఉంటే కళ్ళ నిండా నీళ్లు తిరిగాయని “తెలిపారు. ఇది అసలు కలా నిజమా అనేది తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. చాలా అవమానాలను, ఎన్నో కష్టాలను ఎదుర్కొని నటుడుగా(Tollywood) నిరూపించుకోవాలని పట్టుదలతోనే తాను ఇన్నేళ్లు ఉన్నానని ఎమోషనల్ గా మాట్లాడారు.
వంద కొబ్బరికాయలు కొడతా..
భాను సినిమా అవకాశాల కోసం తానుపడిన తపన తెలియజేస్తూ .. అవకాశాలు రావాలని బోయినపల్లి ఎల్లమ్మ తల్లికి మొక్కుకున్నాను. ప్రతి మంగళవారం చెప్పులు లేకుండా తిరుగుతున్నాను. అవకాశం వచ్చి సినిమా రిలీజ్ అయ్యాక దేవుడికి వంద కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నానని అలాగే నన్ను ఒక నటుడుగా నిలబెట్టి ఇంత మంచి పాత్ర ఇచ్చినట్టు వంటి మా డైరెక్టర్ భిక్ష అన్న నా కొత్త జీవితాన్ని ప్రసాదించారని, అలాగే ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ అన్న రుణాలు ఎప్పటికీ తీర్చుకోలేనిది అంటూ తెలియజేశారు.
ALSO READ:OTT:గర్భిణీ నరబలి..పోలీసులకే సవాల్ విసిరిన మిస్టరీ.. ఓటిటిలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్!
వారి రుణం తీసుకోలేను..
అందుకే అమ్మవారితో పాటుగా నాకు లైఫ్ ఇచ్చిన వీళ్ళకి కూడా ప్రత్యేకించి 100 కొబ్బరికాయలు కొడతానంటూ నటుడు భాను కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమాలో చిన్న క్యారెక్టర్ అనుకుంటే తనకు ఇంత ప్రాధాన్యత ఉండే పాత్రను ఇచ్చి మరి ప్రోత్సహించిన చిత్ర బృందం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు భాను. ప్రస్తుతం భాను మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కావాలని పలువురు నెటిజన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
కొన్ని భావోద్వేగాలు ఇలా ఉంటాయి .. హుషారు పిట్టలు మూవీలో నటించిన భాను ఇలా స్టేజ్ పై ఇది కలో నిజమో అర్ధం కావడం లేదని భావోద్వేగానికి గురయ్యారు .. దయచేసి ట్రోల్ చేయకండి .. ఆయన ఫీలింగ్స్ ని అర్ధం చేసుకోండి .. కష్టపడి అనుకున్నది సాధించినపుడు .. మనసులో ఉన్న భావాలు , పడిన కష్టం ,… pic.twitter.com/Y4dRhKLbMG
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) August 6, 2026




