The Paradise:ప్రముఖ నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇది వరకే ‘దసరా’ సినిమా వచ్చి వారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . ఇక మళ్ళీ ఈ కాంబినేషన్లో సినిమా అనడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అలా వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేసిన చిత్ర బృందం ఇప్పుడు అదిరిపోయే టీజర్ ను విడుదల చేసింది.
నాని ది ప్యారడైజ్ నుండి అఫీషియల్ టీజర్..
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ (Kayadu lohar) హీరోయిన్గా నటిస్తుండగా.. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు , సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ , పాటలు సినిమాపై అంచనాలను అంతకంతకు పెంచుకుంటూ పోయాయి. ఇప్పుడు విడుదల చేసిన టీజర్ మాత్రం అంతకుమించి అనే చెప్పాలి. ఇందులో నాని పాత్రలోని మాస్ యాంగిల్ ను దర్శకుడు శ్రీకాంత్ చాలా ప్రత్యేకంగా చూపించారు.. పవర్ఫుల్ విజువల్స్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ ప్రేక్షకులలో అంచనాలు పెంచుతోంది.
ALSO READ:Tollywood:స్టేజ్ పైనే.. పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
గూస్ బంప్స్ తెప్పిస్తున్న డైలాగ్స్..
తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ లో డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని చెప్పవచ్చు.” ఇకనుంచి ఈ జాగా మనదే..ఈ దేశమే మనదే.. సర్కార్ ఉన్నది మీ దొరల కోసమా.. మా జనం కోసమా, అణచబడ్డ మన జాతి మరలాబడాలే, ఛీ అని చీదరించుకున్న నలుపు రంగే మన జెండా” లాంటి ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ తో ఈ టీజర్ హోరెత్తించింది . ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కొత్తగా ఉంది. ముఖ్యంగా నాని ఈ సినిమాలో ఊర మాస్ లుక్కులో రెండు జడలతో చాలా కొత్త యాంగిల్ లో కనిపించారు. మొత్తానికి అయితే ఈ టీజర్ లో నానితో శ్రీకాంత్ ఓదెల బ్లడ్ బాత్ చేయించారు.
థియేటర్లలో మాస్ జాతర అప్పుడే..
ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం మరింత ప్లస్ గా నిలవనుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రేక్షకులలో సరికొత్త అంచనాలు క్రియేట్ చేసింది . ఇకపోతే ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం, హిందీ తో పాటు పలు భాషలలో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికైతే థియేటర్లలో మాస్ జాతర చేయడానికి సిద్ధమవుతున్నారు నాని. ఈ సినిమాతో రికార్డులు తిరగ రాయడం గ్యారెంటీ అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.




