Wednesday, September 23, 2026
HomeMOVIE NEWSShanmukh Jaswanths:‘అరేయ్ ఏంట్రా ఇది’.. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఇలా మారిపోయాడు ఏంటి..?

Shanmukh Jaswanths:‘అరేయ్ ఏంట్రా ఇది’.. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఇలా మారిపోయాడు ఏంటి..?

Shanmukh Jaswanths:యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌కు సంబంధించిన లేటెస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

on
- Advertisement -banner Ad

Shanmukh Jaswanths:తెలుగు డిజిటల్ కంటెంట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్, నటుడు షణ్ముఖ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఆయనకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో తన ఫ్యామిలీ ఫంక్షన్ లో కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశాడు అంటూ తెలుస్తుంది. అందులో తనకు బాగా గుర్తింపు తెచ్చిన “అరే ఏంట్రా ఇది” అనే డైలాగ్ షన్ను చెప్పడం అభిమానలను ఆకట్టుకుంటుంది.

షార్ట్ ఫిలిమ్స్ తో భారీ క్రేజ్ :

“వైవా” అనే షార్ట్ ఫిలిం తో గుర్తింపు పొందిన షణ్ముఖ్ జస్వంత్ ఆ తరువాత వరుసగా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య, స్టూడెంట్ వంటి వీడియోలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

- Advertisement -
Advertisement

బిగ్బాస్ తో మరింత పాపులారిటీ :

అప్పటికే వచ్చిన పాపులారిటీతో షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanths) బిగ్ బాస్ తెలుగు 5 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఈ సీజన్లో చివరి వరకు తన ఆటతో ఆకట్టుకుని రన్నరప్ గా నిలిచాడు. అయితే హౌస్ లో సిరి హనుమంతుతో అతని బీహేవియర్ అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అదే సమయంలో కుటుంబ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కలేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

also read:Avika Gor :శభాష్ అవికా గోర్‌.. డెంగ్యూ జ్వరంలోనూ అలాంటి పని..!

- Advertisement -
Advertisement

వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు:

బిగ్బాస్ అనంతరం షణ్ముఖ్ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పేసింది. ఇది అప్పట్లో అభిమానులు పెద్ద షాక్ కి గురిచేసింది. ఆ తర్వాత కుటుంబానికి సంబంధించిన కొన్ని వివాదాలు, పోలీసు దర్యాప్తువంటి అంశాలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

also read:Dhurandhar:‘ధురంధర్’కు అరుదైన అంతర్జాతీయ ఘనత.. నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డు!

- Advertisement -
Advertisement

https://www.instagram.com/reel/DanXNRbgbgN/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

కొత్త జీవితం పై ఫ్యాన్స్ హ్యాపీ:

ఈ పరిణామాలు అన్నిటి నుంచి బయటపడిన షణ్ముఖ్ మళ్ళీ సినిమాలో డిజిటల్ ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. “లీల వినోదం” తర్వాత “ప్రేమకు నమస్కారం” వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా వైష్ణవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు , ప్రీ వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన ఒక వీడియో కూడా బాగా ట్రెండ్ అవుతుంది.

అరే ఏంట్రా ఇది :

షణ్ముఖ్ జస్వంత్ ఆ వీడియోలో సందడి చేస్తూ “అరే ఏంట్రా ఇది” అని తన ఫేమస్ డైలాగ్ ను చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఎట్టకేలకు షన్ను జీవితంలో మంచి రోజులు వచ్చాయి అని కొందరు సంతోషపడుతుంటే ..షణ్ముఖ్ ఇంతలా మారిపోయాడు ఏంటి..తన పాత గర్ల్ ఫ్రెండ్ ని మర్చిపోయాడా..? అంటూ ఇంకొందరు వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు. ఇంకొంతమంది షన్ను మంచోడు అందుకే అతనికి మంచి అమ్మాయి వచ్చింది అంటూ మాట్లాడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి షణ్ముఖ్ జశ్వంత్ పేరు బాగా వైరల్ అవుతుంది..!!

https://www.instagram.com/reel/DanXNRbgbgN/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you