Wednesday, September 23, 2026
HomeLATESTDimple Hayathi:తిరుమలలో అద్భుతంగా డ్యాన్స్ చేసిన తెలుగు హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా..?

Dimple Hayathi:తిరుమలలో అద్భుతంగా డ్యాన్స్ చేసిన తెలుగు హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా..?

Dimple Hayathi:శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో నిర్వహించిన నాదనీరాజనం కార్యక్రమంలో హీరోయిన్ డింపుల్ హయాతి అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

on
- Advertisement -banner Ad

Dimple Hayathi:సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే అందరికీ ఉండే ఒక పేరు ఎక్స్‌పోజింగ్ చేస్తారు. సినిమాలో వాళ్ల ఇంపార్టెన్స్ లేకపోయినా సరే, కేవలం గ్లామరస్ పాత్రలు చేసి డబ్బులు సంపాదించుకుంటారు. సినిమాల్లో అవకాశాలు రావడానికి బయట కూడా ఎక్స్‌పోజ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఎక్కువగా ముఖానికి మేకప్‌లు వేస్తుంటారు. ఇంతే.. దీనికి మించి పెద్దగా హీరోయిన్స్ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు అని కొంతమంది జనాల్లో అభిప్రాయం ఉంటుంది.

అదంతా ఫేక్ అని ప్రూవ్ చేసిన డింపుల్ హయాతి..:

అయితే అదంతా ఫేక్ అని, హీరోయిన్స్‌కి ఒక వ్యక్తిగత లైఫ్ ఉంటుంది అని, హీరోయిన్స్‌లోనూ వ్యక్తిగత టాలెంట్ ఉంటుంది అంటూ ప్రూవ్ చేసింది హీరోయిన్ డింపుల్ హయాతి. డింపుల్ హయాతి(Dimple Hayathi) ఇప్పటివరకు నటించిన సినిమాల్లో అందరూ కూడా ఆమెను ఎక్కువగా గ్లామర్ డాల్‌గానే చూశారు. నటన పరంగా ఆమెకు గుర్తింపు తెచ్చే పాత్రలు ఏవీ ఆమెకు రాలేదు.

- Advertisement -
Advertisement

డింపుల్ హయాతి అంటే గ్లామరస్ రోల్స్ చేస్తుంది, ఎక్స్‌పోజింగ్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది.. ఇంతవరకే మాట్లాడుకునే వాళ్లు. కానీ వాటన్నిటికి సంబంధించిన ఎక్స్‌లెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

also read:Ram Charan:ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చరణ్ వింత బిహేవియర్.. ఫ్యాన్స్ షాక్..!

- Advertisement -
Advertisement

తిరుమలలో కూచిపూడి నృత్యం చేసిన డింపుల్ హయాతి.. :

తిరుమలలో డింపుల్ హయాతి కూచిపూడి నృత్యం చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాద నీరాజనంలో అద్భుతమైన కూచిపూడి ప్రదర్శనతో హీరోయిన్ డింపుల్ హయాతి అందరినీ ఆకట్టుకుంది.

చాలా పద్ధతిగా, చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా, చాలా భక్తిశ్రద్ధలతో ఆమె చేసిన డాన్స్ అభిమానులతో పాటు అక్కడ ఉండే జనాలను కూడా ఆకట్టుకుంది. ఇంత బాగా కూచిపూడి నృత్యం చేస్తుందా అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Nani:డైట్లు చేస్తూ కడుపు మాడ్చుకోవాలా..? ఆ పాన్ ఇండియా స్టార్స్ కి నాని కౌంటర్..!

డింపుల్ హయాతిపై ప్రశంసల వర్షం..:

డింపుల్ హయాతి గురించి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఒకరకంగా చర్చలు జరిగాయని, ఇక ఈ వీడియో తర్వాత డింపుల్ హయాతి ఎక్కడికో వెళ్లిపోతుంది అని, ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు డింపుల్ హయాతికి ఎప్పుడూ ఉంటాయి అని అభిమానులు పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు, డింపుల్ హయాతి ఇలాంటి పాత్రలు ఎంచుకుంటే ఖచ్చితంగా ఆమె క్యారెక్టర్‌కి సూట్ అవుతాయని, ఆమె పేరు ఇంకా బాగా పాపులర్ అవుతుంది అని సజెస్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం హీరోయిన్ డింపుల్ హయాతి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన నాద నీరాజన కార్యక్రమంలో ఆమె అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనతో భక్తులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంప్రదాయ నృత్యానికి తనదైన శైలిని జోడిస్తూ డింపుల్ హయాతి చేసిన ప్రదర్శన అందరినీ మెప్పించింది.

ఆమె నృత్యానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. నెటిజన్లు ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. భక్తి, కళాత్మకత కలగలిసిన ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. శ్రీవారి సన్నిధిలో డింపుల్ హయాతి కూచిపూడి నృత్యం చేయడం పట్ల అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you