Wednesday, September 23, 2026
HomeLATESTRam Charan:ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చరణ్ వింత బిహేవియర్.. ఫ్యాన్స్ షాక్..!

Ram Charan:ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చరణ్ వింత బిహేవియర్.. ఫ్యాన్స్ షాక్..!

Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

on
- Advertisement -banner Ad

Ram Charan:సెలబ్రిటీస్‌కు సంబంధించిన చిన్న న్యూస్ అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా బిగ్ బడా పాన్ ఇండియా స్టేటస్ ఉన్న సెలబ్రిటీలు ఏ చిన్న పని చేసినా సరే, దానిలోని తప్పులను వెతుకుతూ ఉంటారు. రీసెంట్‌గా సోషల్ మీడియాలో రామ్ చరణ్‌కు సంబంధించిన ఒక వీడియో బాగా ట్రోలింగ్‌కు గురవుతుంది. దీనిపై కొంతమంది పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంటే, మరి కొంతమంది నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చరణ్ ఇలా..:

రామ్ చరణ్(Ram Charan) ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వస్తారు. సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ ఎయిర్‌పోర్ట్‌కు ఎవరు వచ్చినా సరే, మీడియా వాళ్లు ఫొటోస్, వీడియోస్ తీస్తూ ఉంటారు. రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్స్‌కు ఇది చాలా కామన్. అయితే రామ్ చరణ్ నార్మల్‌గానే, యథావిధిగా నడుస్తూ వస్తున్నారు.

- Advertisement -
Advertisement

చేతిలో ఫోన్ పెట్టుకొని ఫోన్ ఎక్కడ అంటూ అటూ ఇటూ చూస్తూ వెతుకుతూ ఉన్నట్లు కనిపిస్తారు. పాకెట్స్ చెక్ చేసుకుంటారు. సడన్‌గా చేతిలో మొబైల్ ఉన్న విషయాన్ని రియలైజ్ అయి, చేతిలోనే ఉందా అంటూ చెక్ చేసుకుంటారు.

also read:Nani:డైట్లు చేస్తూ కడుపు మాడ్చుకోవాలా..? ఆ పాన్ ఇండియా స్టార్స్ కి నాని కౌంటర్..!

- Advertisement -
Advertisement

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..:

ఇది చాలా నార్మల్‌గా జరిగిన సందర్భం. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. రామ్ చరణ్‌కు 41 ఏళ్ల వయసే.. అప్పుడే మతిమరుపు వచ్చేసిందా..? అంటూ కొందరు కౌంటర్ వేస్తూ నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్లకి మెగా ఫ్యాన్స్ కూడా ధీటుగా జవాబు ఇస్తున్నారు.

also read:Balakrishna :శస్త్రచికిత్స తర్వాత తొలిసారి బాలయ్య దర్శనం.. ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్!

- Advertisement -
Advertisement

మెగా ఫ్యాన్స్ కౌంటర్.. :

మనం పని ఒత్తిడిలో ఉన్నప్పుడు, స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు కొన్ని కొన్ని సార్లు మర్చిపోతాం. ఇంకొన్నిసార్లు హడావిడిగా ఉన్నప్పుడు ఇలాంటివి చాలా కామన్. మన లైఫ్‌లో కూడా జరుగుతాయి. ఆయన కూడా ఒక మనిషే. ఎంత పెద్ద హీరో అయినా ఆయనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానిని ఇంత పెద్ద రాద్ధాంతం చేయాలా..? అని సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు.

రామ్ చరణ్ నార్మల్‌గా మర్చిపోయిన ఫోన్‌ను పట్టుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. రామ్ చరణ్ ఎంత పెద్ద స్టార్ అన్న విషయం అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ.. :

ఒకపక్క ఫ్యామిలీ, మరొకపక్క పర్సనల్ లైఫ్, ఇంకొకపక్క సినిమాలు.. అన్నిటినీ బ్యాలెన్స్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. బాగా ఈ మధ్యనే గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది. ఆ టెన్షన్స్‌లో ఫోన్ చేతిలోనే ఉండి చూసుకోకుండా, పాకెట్స్ వెతుక్కోవచ్చు. దానికి మాత్రాన ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం సరికాదు అంటున్నారు సినీ ప్రముఖులు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you