Wednesday, September 23, 2026
HomeLATESTNani: సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్న నాని..!

Nani: సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్న నాని..!

Nani: ది ప్యారడైజ్ మూవీ కోసం నాని తెలంగాణ ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Nani: నేచురల్ స్టార్ నాని , డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంటే ఈరోజు తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరో నాని చేసిన ఒక విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ప్రేక్షకుల మధ్య కూర్చొని ది ప్యారడైజ్ చిత్రాన్ని ప్రీమియర్ షో వీక్షించేందుకు తనకు అనుమతి ఇవ్వాలి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హీరో నాని కోరారు.

ముఖ్యమంత్రికి నాని విజ్ఞప్తి..

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ నాని కోరికను బయటపెట్టారు. సెప్టెంబర్ 23న జరిగే ప్రీమియర్ షోను అభిమానులు సాధారణ ప్రేక్షకులతో కలిసి చూడాలని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో చూడాలని ఉందంటూ తెలిపారు. సినిమా విడుదల సమయంలో ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో చూడడం తనకు చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది అంటూ హీరో నాని(Nani) పేర్కొన్నారు. ప్యారడైజ్ సినిమా కోసం తాము ఎంత కష్టపడి రూపొందించామో.. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన తమకు చాలా సంతృప్తిని ఇస్తుందంటూ ఆయన అభిప్రాయంగా తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:72nd national awards:72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల లిస్ట్ ఇదే..!

తన కోరికను బయటపెట్టిన నాని..

కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో హీరో నాని హాజరైతే మాత్రం కచ్చితంగా భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. దీంతో భద్రతాపరంగా పలు అంశాలను అధికారులు పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న నాని అవసరమైన అన్ని భద్రత నిబంధనలు ప్రభుత్వ ప్రోటోకాల్స్ ని పూర్తిగా పాటిస్తామని తెలిపారు. తన విజ్ఞప్తిని పరిశీలించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా తెలంగాణ పోలీసులను కూడా హీరో నాని కోరడం జరిగింది.

- Advertisement -
Advertisement

also read:Nani:నేచురల్ స్టార్ నాని కోసం లేడీ అభిమాని స్పెషల్ గిఫ్ట్..!

ముఖ్యమంత్రి ఏమన్నారు అంటే?

దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే పోలీస్ స్టేషన్లో దరఖాస్తు అప్లై చేసుకోండి . వారు అన్ని విధాల అండగా ఉంటారంటూ రిప్లై ఇచ్చారు. ఇదంతా ఇలా ఉంటే ప్యారడైజ్ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు కూడా ఎక్కడ చూసిన రీల్స్ రూపంలో వినిపిస్తూ ఉండడంతో సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది. ఇందులో నానికి జోడిగా కయాదు లోహర్ నటిస్తోంది. విలన్ గా మోహన్ బాబు నటిస్తున్నారు. కీలకమైన పాత్రలో రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర నటీనటులు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా అడ్వాన్స్ సేల్స్ ద్వారా ఏడు కోట్లకు పైగా నమోదైనట్లు వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24వ తేదీన విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? నాని కెరియర్ లోనే ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you