Wednesday, September 23, 2026
HomeLATESTAishwarya Lakshmi :డ్రెస్‌పై ట్రోలింగ్.. ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ రియాక్షన్!

Aishwarya Lakshmi :డ్రెస్‌పై ట్రోలింగ్.. ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ రియాక్షన్!

Aishwarya Lakshmi :హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ధరించిన డ్రెస్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.

on
- Advertisement -banner Ad

Aishwarya Lakshmi :ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ వేసుకునే దుస్తులపై సోషల్ మీడియాలో ఎలాంటి రకాల కన్వర్జేషన్స్, చర్చలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎవరైనా స్టార్ హీరోయిన్ ఒక షాప్ ఓపెనింగ్ ఈవెంట్‌కి కానీ లేదా సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కానీ ఎక్స్‌పోజింగ్ బట్టలు వేసుకుని వస్తే అక్కడ ఫ్యాన్స్, మిగతా జనాలు హంగామా చేసి ఇస్తున్న దృశ్యాలు ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు నిధి అగర్వాల్ ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేసిందో, రీసెంట్ కాలంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా అలాంటి సిచువేషన్ ఫేస్ చేసింది.

ఐశ్వర్య లక్ష్మి డ్రెస్‌పై తీవ్ర చర్చ :

ఓ జువెలరీ ఎగ్జిబిషన్ సందర్భంగా ఐశ్వర్య వేసుకున్న డ్రెస్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై చాలా డిబేట్లు కూడా జరిగాయి. రీసెంట్‌గా ఈ వివాదంపై స్పందించింది నటి ఐశ్వర్య లక్ష్మి. అసలు సమస్య నేను వేసుకున్న బట్టల్లో లేదు అని, అక్కడి వాతావరణం అని, ఫోటోగ్రాఫర్లు చాలా అసభ్యకరంగా ఫోటోలు తీశారు అంటూ మండిపడ్డారు.

- Advertisement -
Advertisement

ఫోటోగ్రాఫర్లు ముఖంపై కాకుండా, సౌకర్యంగా అనిపించని విధంగా ఫోటోలు తీయడం వల్లే సమస్య మొదలైంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. కెమెరా నా ముఖం వైపు ఉండాలి. అలా కాకుండా ఎక్కడెక్కడో పెడితే ఎలా? అది నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకున్నారా? ఆ ఇబ్బందికర పరిస్థితుల్లోనే నా హావభావాలు మారాయి. అక్కడ వ్యక్తిగత సరిహద్దులను ఉల్లంఘించారు వాళ్లు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

అది తెలియకుండా సోషల్ మీడియాలో మాత్రం ఏదేదో నెటిజన్లు వాగేస్తున్నారు అంటూ మండిపడింది.

- Advertisement -
Advertisement

also read:Dimple Hayathi:తిరుమలలో అద్భుతంగా డ్యాన్స్ చేసిన తెలుగు హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా..?

‘అలాంటి దుస్తులు ఎందుకు వేసుకోవాలి?’ అంటూ ప్రశ్నలు :

ఇబ్బందికరంగా అనిపిస్తే అలాంటి దుస్తులు ఎందుకు వేసుకోవాలి అంటూ చాలామంది నెటిజన్లు ఆమెను ప్రశ్నించారు. దీనిపై ఇంటర్వ్యూలో స్పందించింది ఐశ్వర్య లక్ష్మి.

- Advertisement -
Advertisement

అసలు సంస్కృతి అనేది మహిళ ధరించే బట్టల వల్ల వస్తుందా? లేకపోతే సమాజంలో మనం నడుచుకునే తీరు, ప్రవర్తించే విధానంలో ఉంటుందా? ఏది కరెక్ట్? అంటూ స్ట్రైట్‌గా అడిగేసింది.

also read:Ram Charan:ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చరణ్ వింత బిహేవియర్.. ఫ్యాన్స్ షాక్..!

మహిళల దుస్తులపైనే ఎందుకు చర్చ? :

ఒక మహిళ దుస్తులపై సులభంగా కామెంట్లు చేసే సమాజం, ఇతర సమస్యల పట్ల ఎందుకు రియాక్ట్ అవ్వదు? సమాజంలో ఇంకా ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. స్కామ్స్ జరుగుతున్నాయి. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో అనాథలుగా వదిలేస్తున్నారు. భారీ భారీ సమస్యలు ఉన్నాయి. కానీ వాటికి ఎవరు ఆన్సర్ ఇవ్వరు. ఒక మహిళ దుస్తులపై మాత్రమే మాట్లాడుతారు. అలాంటి వాళ్లు అన్ని విషయాలపై కూడా రియాక్ట్ అవ్వాలి అంటూ ఘాటుగా స్పందించింది.

‘దుస్తుల కంటే ప్రవర్తనే ముఖ్యం’ :

దుస్తులకంటే ప్రవర్తన, నియమాలు చాలా చాలా ఇంపార్టెంట్. అదే సంస్కృతి. అదే మనం మన పిల్లలకు నేర్పించాలి. అది మర్చిపోతున్నట్లున్నారు జనాలు అంటూ ఘాటుగా జవాబు ఇచ్చింది.

ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi )మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఐశ్వర్య లక్ష్మికి సపోర్ట్ చేస్తుంటే, మరికొంత మంది మాత్రం ఆమెపై నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

‘నువ్వు అలాంటి బట్టలు వేసుకోకపోతే వాళ్లు ఎక్కడ కెమెరాలు పెట్టినా నీకు ఇబ్బందిగా ఉండేది కాదుగా’ అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you