Balakrishna :నందమూరి బాలకృష్ణ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. అందరికీ తెలిసిన మంచి నటుడు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి సత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. బాలకృష్ణ తన వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతూ వరుస షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
షూటింగ్‌లో గాయం.. రెస్ట్ తీసుకున్న బాలయ్య :
రీసెంట్‌గానే ఆయన సినిమా షూటింగ్లో యాక్షన్ సీన్స్ చేస్తూ ఉండగా కాళ్లకు కొంచెం గాయం అయింది. దీంతో వెంటనే చికిత్స చేయించారు. మూవీ టీమ్‌కు అంతే కాదు, డాక్టర్స్ కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకోవాలని కూడా సూచించారు. దీంతో షూటింగ్‌కు బ్రేక్ చెప్పి బాలయ్య పూర్తిగా ఆరోగ్యం పై కాన్సెంట్రేషన్ చేశారు.
బాలయ్య ఆరోగ్యం ఎలా ఉంది? అసలు బాలయ్య(Balakrishna )ఆరోగ్యం పై అప్డేట్ రావట్లేదు అంటూ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ సినిమా రాబోతుందని చెప్పారు కానీ, బాలయ్య హెల్త్‌కి సంబంధించి ఏ అప్డేట్ చెప్పలేదు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ పడిపోయారు.
also read:Nani: సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్న నాని..!
బాలయ్య నుంచి బయటకు వచ్చిన వీడియో :
అయితే రీసెంట్‌గా బాలయ్య నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది. బాలయ్య పూర్తి ఆరోగ్యవంతుడిగా కనిపించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న బాలకృష్ణ ప్రస్తుతం కోలుకున్నట్లు ఆ వీడియో చూస్తే క్లియర్‌గా అర్థమైపోయింది.
త్వరలోనే ఒకపక్క సినిమాలు, మరొక పక్క పొలిటికల్ పరంగా ముందుకు వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఆ వీడియోలో నందమూరి బాలయ్యను పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదిస్తున్నారు. అంతేకాదు, బాలయ్య కూడా ఆరోగ్యవంతుడిగా కనిపిస్తున్నాడు.
also read:72nd national awards:72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల లిస్ట్ ఇదే..!
పండితుల ఆశీర్వాదాలు తీసుకున్న బాలయ్య:
పూజ అయిపోయిన అనంతరం పండితుల ఆశీర్వాదాలు తీసుకున్న బాలయ్య, ఆ తర్వాత పండితులతో కలిసి ఫోటోలు కూడా తీసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక బాలయ్య ఫ్యాన్స్ మళ్లీ జోష్‌లోకి వచ్చారు. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న బాలయ్య త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాడు మన బాలయ్య అంటూ తెగ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు.
సింహం ఈజ్ బ్యాక్ అంటున్న ఫ్యాన్స్ :
బాలయ్య అంటే ఎంతమంది ఇష్టపడతారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి బాలయ్య మళ్లీ బ్యాక్ టు ఫీల్డ్ అనేసరికి ఫ్యాన్స్‌లో తెలియని కొత్త జోష్ మొదలైంది. ఇక పనిలో పని మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చేస్తాడు. బాలయ్య సింహం ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలయ్య సినిమాలపై ఆసక్తి :
బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “దాదా” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. అంతేకాదు, సంజయ్ దత్, మచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
బాలయ్య – ధమన్ టైమింగ్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే బాలయ్య ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది.
శస్త్ర చికిత్స నుండి కోలుకుని త్వరలో ప్రజా క్షేత్రం లోకి Nandamuri Balakrishna గారు..#NandamuriBalakrishna #MokshagnaOrgKurnool pic.twitter.com/QhnOOUPe4h
— mokshagna.org (@MokshagnaO96777) September 22, 2026




