Saturday, August 8, 2026
HomeLATESTOTT :క్రైమ్ థ్రిల్లర్ లకి అమ్మ మొగుడి లాంటి సినిమా ఇది..ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్ మూవీ..!

OTT :క్రైమ్ థ్రిల్లర్ లకి అమ్మ మొగుడి లాంటి సినిమా ఇది..ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్ మూవీ..!

OTT :‘పంచనామా’ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

on
- Advertisement -banner Ad

OTT :ఓటిటి ప్లాట్ఫామ్ లలో ఈ వారం క్రైమ్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా థియేటర్లలో విడుదలైన సినిమాలో ఒక్కొక్కటిగా డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వస్తుండగా తాజాగా మరొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓటిటిలోకి అడుగు పెట్టింది. అదే “పంచనామా” జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తాజాగా డిజిటల్ స్క్రీనింగ్ లోను అందుబాటులోకి వచ్చింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్:

పంచనామ సినిమా తాజాగా ప్రముఖ ఓటిటి (OTT )ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కు మిశ్రమ స్పందన లభించింది. అయితే ఓటిటిలో మాత్రం దుమ్ము లేపేస్తుంది. ఓటీటీలోకి అందుబాటులోకి రావడంతో ఈ సినిమాను ఇంటి వద్ద వీక్షించే అవకాశం ప్రేక్షకులకు లభించింది. ప్రస్తుతం “పంచనామా”ను అమెజాన్ ప్రైమ్ వీడియోలు సాధారణ సబ్స్క్రైబ్ తో కాకుండా రెంటల్ విధానంలో మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రెంట్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా సాధారణ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ లో భాగంగా ఉచితంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. క్రైమ్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కధాంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు పంచనామా ఓటీటీలో మంచి ఆప్షన్ గా నిలవనుంది.

- Advertisement -
Advertisement

also read:Shanmukh Jaswanths:‘అరేయ్ ఏంట్రా ఇది’.. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఇలా మారిపోయాడు ఏంటి..?

వరుస హత్యలు చుట్టూ కథ:

“పంచనామా” కథ మొత్తం ఓ సంచలన క్రైమ్ కేసు చుట్టూ తిరుగుతుంది. నగరంలో వరుసగా దారుణ హత్య జరగడంతో ప్రజల్లో భయాందోళనలో మొదలవుతాయి. హత్యలకు పాల్పడుతున్న వ్యక్తి ఎవరు? అతని లక్ష్యం ఏంటి? అనే ప్రశ్నలకు పోలీసులకు సమాధానాలు దొరకవు. కేసులో ఒక స్పష్టమైన ఆధారం కూడా లభించకపోవడంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారుతుంది. కేసును చేధించేందుకు చివరకు ఒక ప్రత్యేక అధికారి రంగంలోకి దిగుతాడు. అతడు దర్యాప్తుని ఏ కోణంలో ముందుకు తీసుకెళ్తాడు..? హత్యలు వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వరుస నేరాలకు కారణమైన మోటివ్ ఏంటి? చివరికి పోలీసులు హంతకుడిని ఎలా పట్టుకున్నారు ? అనే అంశాల చుట్టూనే కథ సాగుతుంది. అనూహ్య మలుపులు ,సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించే కొనసాగించేలా సినిమాలు తెరకెక్కించారు.

- Advertisement -
Advertisement

also read:Avika Gor :శభాష్ అవికా గోర్‌.. డెంగ్యూ జ్వరంలోనూ అలాంటి పని..!

నటీనటుల సాంకేతిక బృందం :

ఈ చిత్రానికి సిగతాపు రమేష్ దర్శకత్వం వహించారు. క్రైమ్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ అంశాలను ఆసక్తికరంగా మలితం చేస్తూ సినిమాను తెరకెక్కించారు. జాన్ రమేష్, ప్రజ్ఞా రెడ్డి, కె. దినేష్, హేమ సుధ, అపూర్వ శ్రీనివాసన్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. హార్దిక క్రియేషన్స్ బ్యానర్‌పై గద్దె శివకృష్ణ, వెలగ రాము సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉత్కంఠ భరితమైన కథనం, అనూహ్య మలుపులు, దర్యాప్తు నేపథ్యంలో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం మంచి ఆప్షన్ గా నిలవచ్చు. ముఖ్యంగా క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ జానర్ లో సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఓటీటీలో పంచనామాను తప్పక ప్రయత్నించవచ్చు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you