Tuesday, September 22, 2026
HomeLATESTRaghav Juyals:సుమ చీర కొంగుతో డ్యాన్స్.. ప్యార‌డైజ్ ప్రీరిలీజ్‌లో సూపర్ సీన్..!

Raghav Juyals:సుమ చీర కొంగుతో డ్యాన్స్.. ప్యార‌డైజ్ ప్రీరిలీజ్‌లో సూపర్ సీన్..!

Raghav Juyals:'పారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాఘవ్ జుయాల్‌ తన అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు.

on
- Advertisement -banner Ad

Raghav Juyals:టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్‌గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని తాజాగా నటించిన చిత్రం ‘పారడైజ్’. ఈ సినిమాపై అభిమానుల్లో ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి నాని ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాపై ఎలాంటి హై క్రియేట్ అయిందో అందరికీ బాగా తెలిసిందే. ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ నెల 24వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో రిలీజ్ కావడానికి సిద్ధమైంది.

ఘనంగా ‘ది పారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ :

ఈ క్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికలో నాని ‘ పారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. యాంకర్ సుమ తన హోస్టింగ్‌తో అదరగొట్టేసింది. అయితే ప్రతి ఈవెంట్‌కైనా హీరో, హీరోయిన్ కన్నా కూడా హైలైట్‌గా మారే సుమ.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెకండ్ ప్లేస్‌తో నిలిచింది. ఫస్ట్ ప్లేస్‌లో మాత్రం బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ (Raghav Juyals)ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

- Advertisement -
Advertisement

also read:Anupama parameswaran: జిగేలుమనిపించేలా ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్!

సుమతో రాఘవ్ జుయల్ డాన్స్ :

స్టేజ్‌పైకి రావడంతోనే హడావిడి చేస్తూ, డాన్స్ చేస్తూ హంగామా చేస్తూ ఏకంగా సుమ చీర కొంగును తీసుకుని గిటార్ స్టెప్పు వేసి అందరినీ నవ్వించాడు. ఇక సినిమాలోని ‘యాషణగుల’ పాటకి, ‘ఆయా షేర్’ పాటకి ఆయన వేసిన స్టెప్స్ అయితే అక్కడ ఉండే జనాలను నవ్వించాయి. ఒకపక్క గ్రేస్, మరొకపక్క పవర్.. రెండింటితో పాటు కామెడీని కూడా జోడించి అభిమానులను కడుపుబ్బా నవ్వేలా చేశాడు.

- Advertisement -
Advertisement

అతడు వేదికపైకి వస్తే డాన్స్ మూడ్ తీసుకొచ్చేశాడు. స్టేజిపై యాంకర్ సుమతో ఆయన చేసిన డాన్స్ ఇంకా హైలైట్‌గా మారింది.

also read:Allu Arjun Raaka: గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన రాకా..!

- Advertisement -
Advertisement

‘పారడైజ్’లో క్రూరమైన విలన్‌గా రాఘవ్ :

రాఘవ్ ‘పారడైజ్’ సినిమాలో క్రూరమైన విలన్ రోల్‌లో నటించినట్లు తెలుస్తుంది. ‘కింగ్ ఆఫ్ స్లో మోషన్’గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఈ సినిమాలో వైలెంట్ విలన్‌గా ముద్ర వేసుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు మూవీ టీమ్.

గతంలో రాఘవ్ బాలీవుడ్‌లో చేసిన ‘కిల్’ సినిమాలోని నెగిటివ్ రోల్ అభిమానులను ఎంతగానో మెప్పించింది అనేది అందరికీ తెలిసిందే. ఆ సినిమా చూసే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ పాత్రకు రాఘవ్‌ను పర్ఫెక్ట్‌గా ఓకే చేశారట. నాని కూడా ఈ సినిమాలోని విలన్ క్యారెక్టర్ గురించి హైప్ చేస్తూ మాట్లాడటం మరింత గ్రేస్ పెంచేసింది.

డాన్స్ నుంచి నటుడిగా రాఘవ్ జుయల్ :

డాన్స్ రియాలిటీ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు హోస్ట్‌గా, కొరియోగ్రాఫర్‌గా, ఆ తర్వాత నటుడిగా ఎదిగాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ విలన్ క్యారెక్టర్స్‌లో నటించే స్టార్‌గా ఆయన పేరు వినిపిస్తుంది. అంటే ఆయన టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 24న ‘పారడైజ్’ రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా రాఘవ్ జుయల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుందని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం సుమతో ఆయన వేసిన డాన్స్ స్టెప్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you