Tuesday, September 22, 2026
HomeLATESTDilraju: పవన్ కళ్యాణ్ చేసిన సహాయం మర్చిపోలేను.. దిల్ రాజ్ కామెంట్స్..

Dilraju: పవన్ కళ్యాణ్ చేసిన సహాయం మర్చిపోలేను.. దిల్ రాజ్ కామెంట్స్..

Dilraju: ది ప్యారడైజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ దిల్ రాజు కామెంట్స్ చేశారు.

on
- Advertisement -banner Ad

Dilraju: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించిన వారిలో దిల్ రాజు కూడా ఒకరు. కానీ గత ఏడాది నుంచి సరైన సక్సెస్ లేక దిల్ రాజు సతమతమవుతున్నారు. ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలను నిర్మించినా.. ఆ చిత్రాలు కూడా డిజాస్టర్ గా మిగిలాయి. ఇప్పుడు తాజాగా నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రోజున చాలా గ్రాండ్ గా జరిగింది . ఈవెంట్ కి వచ్చిన దిల్ రాజు అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.

పవన్ కళ్యాణ్ చేసిన సహాయాన్ని మరువలేను..

అసలు విషయంలోకి వెళ్తే.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రోజున అట్టహాసంగా నిర్వహించగా.. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన నిర్మాత దిల్ రాజు తన ప్రసంగం లో పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. దాదాపుగా పాతికేళ్ల సినీ పరిశ్రమలో తాను ఎన్నో ఆటుపోట్లను చూశాను. కానీ పవన్ కళ్యాణ్ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై వచ్చిన వకీల్ సాబ్ సినిమా సమయంలో ఒక కీలకమైన విషయాన్ని అభిమానులతో దిల్ రాజు(Dilraju) పంచుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Raghav Juyals:సుమ చీర కొంగుతో డ్యాన్స్.. ప్యార‌డైజ్ ప్రీరిలీజ్‌లో సూపర్ సీన్..!

నిర్మాతల కష్టాన్ని అర్థం చేసుకున్న రియల్ హీరో..

నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా అభిమానం . ఆయనతో కలిసి మేము వకీల్ సాబ్ సినిమాని నిర్మించాము. అయితే ఆ సినిమా విడుదల సమయానికి కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో థియేటర్ల పరిమితుల వల్ల మాకు చాలా నష్టాలు తెచ్చిపెట్టాయి. ఆ కష్ట సమయాలలో నిర్మాతగా మేము ఇబ్బందులలో ఉన్నామని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆయనకు ఇవ్వాల్సిన 5 కోట్ల రూపాయలను తీసుకోకుండా వదిలేశారని తెలిపారు దిల్ రాజ్. తమ పరిస్థితులను అర్థం చేసుకొని, నిర్మాతను ఆదుకునే ఇలాంటి గొప్ప గుణం కలిగిన వారు తక్కువ మందే ఉంటారు .దటిజ్ పవర్ స్టార్ అంటూ దిల్ రాజు తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Anupama parameswaran: జిగేలుమనిపించేలా ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్!

నిర్మాతల పాలిట దేవుడిగా పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడంతో సినిమాలకు దూరమయ్యారు. అనంతరం మూడేళ్లు విరామం తర్వాత రీ ఎంట్రీ వకీల్ సాబ్ సినిమాతోనే ఇచ్చారు. ఈ సినిమా 2021లో విడుదల అయ్యింది. బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా సరికొత్త రికార్డులను సృష్టించింది. తొలిరోజే దేశవ్యాప్తంగా 38 కోట్ల రూపాయలను సాధించడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో 32 కోట్లకు పైగా షేర్ని రాబట్టింది. అతి తక్కువ సమయంలోనే 100 కోట్ల మార్కుని అందుకున్న సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి దిల్ రాజు కోసం పవన్ కళ్యాణ్ 5 కోట్ల రూపాయలను త్యాగం చేశారని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విషయంలో కూడా రెమ్యూనరేషన్ వదులుకున్నట్లు వార్తలు వినిపించాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you