Tuesday, September 22, 2026
HomeLATESTUdaya Bhanu:"నాకు కవల పిల్లలు పుట్టడానికి కారణం అదే"..సీక్రేట్ బయటపెట్టిన ఉదయభాను..!

Udaya Bhanu:”నాకు కవల పిల్లలు పుట్టడానికి కారణం అదే”..సీక్రేట్ బయటపెట్టిన ఉదయభాను..!

Udaya Bhanu:యాంకర్ ఉదయభాను తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

on
- Advertisement -banner Ad

Udaya Bhanu: ఉదయభాను.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్‌గా రాజ్యం ఏలేసిన అమ్మాయి. కొన్నాళ్లపాటు కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. కానీ మళ్లీ ఇప్పుడిప్పుడే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బిజీగా ముందుకు వెళ్తుంది.

ఉదయభాను మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కింది అంటే ఆ ఊపు వచ్చేస్తుంది. అది ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఉదయభాను మాటలకు మెల్ట్ అవ్వాల్సిందే. షో కచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. వల్గారిటీ లేకుండా ఒక ఫంక్షన్‌ను హాయిగా, చక్కగా ముందుకు తీసుకెళ్లే సత్తా ఉదయభానుకుంది. యాంకర్ ఉదయభాను అంటే ఇష్టం లేని వాళ్లు అస్సలు ఉండరు. ఆమె చేసే షోలు, ఆమె మాట్లాడే మాటలు, ఆమె పద్ధతి, ఆమె బిహేవియర్ అందరికీ నచ్చుతుంది.

- Advertisement -
Advertisement

ఉదయభాను ఫ్యామిలీ లైఫ్ కూడా ప్రత్యేకమే :

ఉదయభాను ఫ్యామిలీ లైఫ్ కూడా అందరికీ బాగా నచ్చుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు.. మాకు కవల పిల్లలు కావాలి, కావాలని కోరుకుంటారు. కానీ అందరికీ ఆ అదృష్టం దక్కదు. ఉదయభానుకు ఆ అదృష్టం దక్కింది.

అందరూ ఆడపిల్లలు కావాలని కోరుకున్నట్లుగానే ఉదయభాను కూడా నాకు కవల పిల్లలు కావాలి, కవల పిల్లలు పుట్టాలి అని చాలా బాగా కోరుకునేదట. అయితే దేవుడు నిజంగానే ఆమెకు ఇద్దరు క్యూట్ ఆడపిల్లలను ట్విన్స్‌గా ఇచ్చారు.

- Advertisement -
Advertisement

కవల పిల్లల విషయంలో క్లారిటీ ఇచ్చిన ఉదయభాను :

చాలామంది ఉదయభాను ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల కవల పిల్లలు పుట్టారు అని అనుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తనకు కవల పిల్లలు ఎందుకు పుట్టారు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించింది.

ఆమెకు మొదటి నుంచి సీతాదేవి అంటే చాలా చాలా ఇష్టమట. ఆమెను ఎక్కువగా ఆరాధిస్తూ, కొలుస్తూ ఉంటుందట.

- Advertisement -
Advertisement

also read: Radha case:పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అలనాటి హీరోయిన్ రాధ!

ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటన :

ఆమె గర్భం దాల్చడానికి సరిగ్గా మూడు నెలల సమయం ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో ఒక షోను హోస్ట్ చేసిందట. ఆ షోను హోస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన ఈవెంట్ వాళ్లకు కూడా ఇద్దరు కవల పిల్లలట. ఆ షో చేస్తున్నంతసేపు, షో తర్వాత కూడా ఆ ఇద్దరు కవలలను ఆమె హత్తుకొని, బాగా చక్కగా ముద్దులు చేస్తూ, దగ్గర తీసుకొని ఉండేదట. అప్పుడే అనుకుందట.. నాకు ఇలాంటి ఇద్దరు కవల పిల్లలు ఉంటే బాగుండు అని అనుకుందట.

also read: The Paradise nani: నానిని తొక్కేయడానికి చూస్తున్నది ఆ నలుగురేనా..? ఫ్యాన్స్ కనిపెట్టేశారు..!

కవల పిల్లలపై ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్ :

ఆ దేవుడు నా బాధ విన్నట్టున్నాడు. అందుకే నేను ఆ షో అయిన మూడు నెలలకి ఇద్దరు ఆడపిల్లలను నా కడుపున పుట్టేలా ప్లాన్ చేశాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు.. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను అనుకున్న కవల పిల్లలు నాకు పుట్టారు.

నన్ను బంగారంలా చూసుకుంటారు. ఏదైనా సన్నివేశంలో నేను ఏడుస్తూ ఉన్నా, ‘అమ్మా.. ఇలా చూడు, ఇలా చూడు’ అంటూ నన్ను గుర్తు చేస్తూ ఉంటారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి ఆడపిల్లలు నాకు పుట్టరు అంటూ ఉదయభాను ఎమోషనల్ అయింది. దీంతో చాలామంది ఉదయభాను ‘సో లక్కీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you