Allu Arjun Raaka: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం రాకా. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. ఇప్పటికే రాకా సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా అంచనాలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun Raaka) కనిపించే తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మొదటిసారి అల్లు అర్జున్ కెరీర్ లోనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్నట్లు వినిపిస్తోంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్న రాకా..
అసలు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనగానే అందరికీ భారీ హాలీవుడ్ చిత్రాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పరంగా సరికొత్త బౌండరీలను బ్రేక్ చేస్తోంది రాకా మూవీ. ఎక్కువమంది పర్ఫార్మర్లను రియల్ టైం లో ఏకకాలంలో మోషన్ క్యాప్చర్ చేసిన చిత్రంగా ఒక సంచలనం సృష్టించింది. ఈ సినిమా కోసం ఏకంగా 37 మంది పెర్ఫామ్మర్లను లైవ్ మోషన్ క్యాప్చర్ ద్వారా బంధించి మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తమ పేరు నిలిచేలా చేసింది. ఈ సినిమాపై విజువల్స్ పట్ల మేకర్స్ పెడుతున్న ఎఫెక్ట్ , వాడుతున్న టెక్నాలజీ ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
also read:Rashmika :తెలంగాణ యాస పై ట్రోల్స్..దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక కౌంటర్ !
స్వయంగా షేర్ చేసిన బృందం..
ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులతో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ స్వయంగా ఆ ధృవీకరణ పత్రాన్ని అందుకోవడంతో అభిమానులు సైతం ఈ విషయాన్ని జనాలలో వైరల్ గా చేస్తున్నారు. సన్ పిక్చర్ బ్యానర్ పైన అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఈవెంట్ వేదిక పైన అటు అల్లు అర్జున్ చాలా గర్వంగా గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ను పట్టుకొని మరి ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:Ramanandana Couple:రమానందన వీసా స్కామ్ కేసులో మరో ఊహించని ట్విస్ట్..ఇక చచ్చింది గొర్రె..!
గ్లోబల్ స్థాయిలో గుర్తింపు..
రాకా సినిమా కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాకుండా గ్లోబల్ స్థాయిలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. రిలీజ్ కి ముందే ఇలా సరికొత్త రికార్డులతో దుమ్ము రేపుతుండడంతో ఆడియన్స్ లో కూడా సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరి రాకా సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. చివరిగా అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమాలో హీరోగా నటించి సరికొత్త రికార్డులను తిరగరాశారు. ఈ సినిమాతోనే ఇతర దేశాలలో కూడా అల్లు అర్జున్ సరికొత్త అభిమానులను కూడా సంపాదించుకున్నారు.
A global triumph in motion capture! 🏆🌎#Raaka sets a Guinness World Record for the ‘Most People Motion-Captured in Real-Time’, with 37 performers captured simultaneously ✨@alluarjun @Atlee_dir @GWR#Raaka #AlluArjun #Atlee #GuinnessWorldRecords pic.twitter.com/hotAxnrgfE
— Sun Pictures (@sunpictures) September 21, 2026




