Tuesday, September 22, 2026
HomeLATESTRadha case:పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అలనాటి హీరోయిన్ రాధ!

Radha case:పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అలనాటి హీరోయిన్ రాధ!

Radha case: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న అలనాటి హీరోయిన్ రాధ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Radha case:టాలీవుడ్ లో ఒకప్పుడు అలనాటి హీరోయిన్లలో అందం, అభినయంతో ఎంతో మందిని అలరించిన హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన రాధ.. భాషతో సంబంధం లేకుండా ఎన్నో భాషలలో నటించి మంచి పేరు సంపాదించింది. అయితే సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్న రాధ(Radha case) ఇప్పుడు తాజాగా చెన్నై పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున పైన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన నుంచి 46 కోట్ల రూపాయలు విలువైన బ్యాంకు చెక్కులను దొంగలించారని, ఆ డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారంటూ ఫిర్యాదులు తెలియజేసినట్లు సమాచారం.

పోలీస్ స్టేషన్లో రాధ సోదరిపై కేసు ఫైల్..

అలనాటి హీరోయిన్ రాధ ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. రాధా తన వ్యాపార అవసరాల కోసం ARS గార్డెన్ స్టూడియో పేరుతో ఒక కరెంట్ బ్యాంక్ అకౌంట్ ను ఏర్పాటు చేసుకుంది .అందులో కరెంటు బిల్లులు, ట్యాక్స్, ఇతర నిర్వహణ ఖర్చులకోసం ఆమె ముందుగా సంతకం చేసిన కొన్ని చెక్కులను తన గదిలో చాలా భద్రపరుచుకున్నారు. అయితే 2025 జనవరిలో రాధ తన ARS గార్డెన్ స్టూడియో పేరును RR గార్డెన్స్ గా మార్చుకుంది. అందుకు సంబంధించి కొత్త చెక్ బుక్ కూడా తీసుకున్నదట. పాత చెక్ బుక్ వాడడాన్ని ఆపివేయడంతో ఆ పాత చెక్కులను ఉపయోగించుకొని 46 కోట్ల రూపాయలు విలువైన డబ్బులను డ్రా చేసుకోవడానికి సెప్టెంబర్ 17న అమెరికా ప్రయత్నించినట్లు రాధ గుర్తించింది.

- Advertisement -
Advertisement

also read:Dilraju: పవన్ కళ్యాణ్ చేసిన సహాయం మర్చిపోలేను.. దిల్ రాజ్ కామెంట్స్..

నమ్మించి మోసం చేశారంటే..

దీంతో వెంటనే రాధా అప్రమత్తమై.. ఆ లావాదేవీలను నిలిపివేసింది. ఇప్పుడు అదే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే అంబికాకు ఆ గదిలో వెళ్లే అవకాశం ఉన్నదని ఆ చనువుతోనే తన అనుమతి లేకుండా గదిలోకి వెళ్లి మరీ ఆ చెక్కులను తన అక్క అంబిక దొంగిలించినట్లు రాధ ఆరోపణలు చేస్తోంది. ఆ ఖాళీ చెక్కుల పైన పేర్లు, వివరాలన్నీ కూడా తన సోదరుడు మల్లికార్జున నింపాడు అంటూ రాధా అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ డబ్బుల కోసమే ఇద్దరు కలిసి ఇలాంటి పని చేశారని ఫిర్యాదులో తెలిపింది రాధ.

- Advertisement -
Advertisement

also read:Raghav Juyals:సుమ చీర కొంగుతో డ్యాన్స్.. ప్యార‌డైజ్ ప్రీరిలీజ్‌లో సూపర్ సీన్..!

తన అక్క ఇలా చేస్తుందనుకోలేదంటున్న రాధ..

తన పాత చెక్కులను తాను ఎవరికీ ఇవ్వలేదని , అసలు అంత పెద్ద మొత్తంలో చెల్లించాల్సిన అవసరం తనకు లేదంటూ తెలిపింది. అలాగే తన గదిలో కొన్ని విలువైన ఆభరణాలు ఆస్తి పత్రాలు కూడా చూసుకోనివ్వకుండా వారు అడ్డుపడుతున్నారు అంటూ ఆరోపణలు చేసింది. పైగా సమగ్ర విచారణ జరపాలి అని , తప్పు చేసిన వారి పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరింది రాధ. అనంతరం చెన్నై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కంప్లైంట్ ఫైల్ చేసిన అనంతరం రాధ మీడియాతో ఈ విషయాలను పంచుకున్నారు. 2006 లోని ఆస్తి పంపకాలు జరిగాయని, అందరికీ సమానంగానే ఆస్తి తీసుకున్నాము. కానీ తన ప్రాపర్టీ బాధ్యతలను తన సోదరి అంబికాకు అప్పగించాను కానీ నా సోదరి అంబికా సోదరుడు మల్లికార్జున ఇలాంటి పనిచేస్తారు అనుకోలేదు. సుమారుగా 5 చెక్కులను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నాలు చేశారంటూ రాధ తెలిపింది. సెప్టెంబర్ 17న మా అక్క అంబిక తన పేరు మీద ఉండే చెక్కులను పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చినట్లుగా బ్యాంకు నుంచి మెసేజ్ రావడంతో భయం వేసి వెంటనే బ్యాంకును సంప్రదించానని, ఆ లావాదేవీలను నిలిపివేయాలని కోరానని తెలిపింది. సుమారుగా ఏడాదికి పైగా తన ని ఇంట్లోకి రానివ్వలేదని, అందుకే ఇప్పుడు పోలీసులను ఆశ్రయించానని తెలిపింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you