Vijay:దళపతి విజయ్ సినిమాలో ఉన్నప్పుడు ఈయనపై ఎటువంటి కాంట్రవర్షియల్ కంటెంట్ బయటికి రాలేదు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో.. అప్పటి నుంచి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన భార్య సంగీతాతో వచ్చిన విభేదాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. ఇక అందరూ అయ్యయ్యో అనుకుంటున్నా సమయంలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కారు. దీంత ఒక్కసారిగా దళపతి విజయ్ (Vijay)ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. విజయ్ సంగీత ఎంత మంచి దంపతులనే విషయం అందరికీ తెలిసిందే . వీళ్లిద్దరు విడాకులు తీసుకోకూడదు దేవుడా అంటూ జనాలు ఎంతోమంది ప్రార్థించారు. ఫైనల్లీ దేవుడు విన్నట్టున్నాడు అందుకే విజయ్ సతిమణీ సంగీత విడాకులు కావాలి అంటూ కోర్టులో పిటిషన్ వేసిన దాన్ని విత్ డ్రా చేసుకుంది . ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.
మళ్లీ కలిసే అవకాశం ఉందా..?
సంగీత విడాకుల పిటీషన్ ఉపసంహరించుకోవడంతో విజయ్ తో మళ్ళీ కలువబోతుంది అని..తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించేందుకు ఇద్దరు రెడీ అయ్యారు అని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎవరు అఫీషియల్ గా స్పందించలేదు. మరోవైపు కోర్టు బయట ఇరు కుటుంబాలు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ లో మరోగందర గోల పరిస్థితి నెలకొంది.
ALSO READ:Ajay Bhupathi :‘శ్రీనివాస మంగాపురం’ ఫ్లాప్.. అజయ్ భూపతి మాటలకు నెటిజన్లు ఫిదా!
విజయ్ హోదాకు ఇబ్బంది రాకూడదని నిర్ణయం:
ప్రస్తుతం విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు రాజకీయంగా కూడా చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఆ కారణంగానే ఆయన గౌరవానికి రాజకీయ ప్రతిష్టకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే సంగీత విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మళ్లీ ఆమె విజయ్ తో కలిసే ప్రసక్తే లేదు అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. విడాకుల వ్యవహారం రాజకీయ విమర్శలకు దారితీయకుండా చూడాలని ఉద్దేశంతోనే శ్రేయోభిలాషులు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారట సంగీత.
ALSO READ:Ali:‘నన్ను కరివేపాకులా తీసి పారేశారు’.. మనసులోని బాధని బయటపెట్టిన నటుడు అలీ..!
కుటుంబ సభ్యుల సమక్షంలో చర్చలు :
అయితే ఈ అంశాన్ని మీడియా చర్చలకు కోర్టు పరిధికి దూరంగా ఉంచాలి అంటూ ఇరు కుటుంబాలు భావిస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమిళ మీడియా చెబుతుంది. ఇందుకోసం ఇరు కుటుంబాలు మధ్యవర్తుల సమక్షంలో చర్చలు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
1998లో రిజిస్టర్ మ్యారేజ్:
విజయ్ – సంగీత 1998లో మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. అనంతరం 1999లో చెన్నైలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు. ప్రస్తుతం విడాకుల పిటిషన్ ఉపసంహరణ నేపథ్యంలో వీరిద్దరి వైవాహిక బంధంపై జరుగుతున్న చర్చలకు ఎప్పుడు, ఎలా తెరపడుతుందో చూడాలి..???




